iDreamPost
android-app
ios-app

రామ్ చరణ్ బర్త్ డేకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తల్లి సురేఖ!

  • Published Mar 26, 2024 | 4:46 PM Updated Updated Mar 26, 2024 | 4:46 PM

Ram Charan- Konidela Surekha: రామ్ చరణ్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేసేస్తున్నారు. అయితే తల్లి సురేఖ మాత్రం కుమారుడి కోసం మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.

Ram Charan- Konidela Surekha: రామ్ చరణ్ పుట్టినరోజు కోసం ఫ్యాన్స్ ఫుల్ హంగామా చేసేస్తున్నారు. అయితే తల్లి సురేఖ మాత్రం కుమారుడి కోసం మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు.

  • Published Mar 26, 2024 | 4:46 PMUpdated Mar 26, 2024 | 4:46 PM
రామ్ చరణ్ బర్త్ డేకి మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన తల్లి సురేఖ!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వచ్చేస్తోంది. మరికొన్ని గంటల్లో రామ్ చరణ్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకోబోతున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయిపోయింది. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా పెద్దఎత్తున సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎంత అభిమానులు చేసినా కూడా.. ఇంట్లో వాళ్లు ఇచ్చే సర్ ప్రైజ్ మాత్రం ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి ఒక గిఫ్ట్ రామ్ చరణ్ కు తల్లి కొణిదెల సురేఖ ఇచ్చారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ పెద్దఎత్తున కార్యక్రమాలు, సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారు. అలాగే తల్లి సురేఖ- భార్య ఉపాసన కూడా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వారి ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. విషయం ఏంటంటే.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి సురేఖ అన్నదానం నిర్వహించారు. వాళ్లు తాజాగా స్టార్ట్ చేసిన అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరఫున 500 మందికి అన్నదానం చేశారు. అపోలో ఆస్పత్రి పుష్కరోత్సవం ఆలయంలో 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. జస్ట్ సురేఖ అన్నదానం మాత్రమే చేయలేదు.

ఆవిడే దగ్గరుండి వండించి, అన్ని పనులు చూసుకుని.. ఆ తర్వాత వచ్చిన వారికి స్వయంగా వడ్డించారు కూడా. ఈ కార్యక్రమానికి చిన్నజియ్యర్ స్వామి కూడా హాజరయ్యారు. అలాగే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ విషయాన్ని ఒక వీడియో రూపంలో అత్తమ్మాస్ కిచెన్ ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కు ఇంతకన్నా బెస్ట్ గిఫ్ట్ ఇంకా ఎవరూ ఇవ్వలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి సురేఖ ఎంతో గొప్ప పని చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ సినిమా నుంచి మార్చి 27న ఉదయం 9 గంటలకు జరగండి జరగండి అనే పాట రాబోతోంది. ఈ సాంగ్ కోసం అదిరిపోయే సెట్ వర్క్ చేశారంట. సాంగ్ షూట్ కోసమే రూ.16 కోట్లు ఖర్చు చేశారు అని టాక్ ఉంది. కాబట్టి బర్త్ డేకి ఇంత కన్నా బెస్ట్ అప్ డేటి ఇంకొకటి ఉండదేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆర్సీ16, ఆర్సీ17 సినిమాల నుంచి కూడా ఒక పోస్టరో.. టైటిల్ టీజర్లో విడుదల చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే గేమ్ ఛేంజర్ నుంచి అప్ డేట్ అయితే అఫీషియల్ అయిపోయింది. కానీ, ఆర్సీ16, ఆర్సీ17 నుంచి మాత్రం ఎక్స్ పెక్ట్ చేయడానికి లేదు. వాటి నుంచి అప్ డేట్స్ వస్తే అవి బోనస్ అనే అనుకోవాలి. మరి.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తల్లి సురేఖ అన్నదానం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss