Somesekhar
Devara Trailer, Jr. NTR: దేవర మూవీకి సంబంధించి ఓ విషయాన్ని ఇన్ని రోజులు దాస్తూ వచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ. మరి ఆ విషయాన్ని ట్రైలర్ లో అయినా.. చెప్తాడా? అంటూ ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఆ విషయం ఏంటంటే?
Devara Trailer, Jr. NTR: దేవర మూవీకి సంబంధించి ఓ విషయాన్ని ఇన్ని రోజులు దాస్తూ వచ్చాడు డైరెక్టర్ కొరటాల శివ. మరి ఆ విషయాన్ని ట్రైలర్ లో అయినా.. చెప్తాడా? అంటూ ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఆ విషయం ఏంటంటే?
Somesekhar
‘దేవర’.. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో కొరటాల శివ చూపించాడని గ్లింప్స్, పోస్టర్స్ చూస్తేనే అర్థం అవుతోంది. ప్రచార చిత్రాలతోనే దేవర భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసింది. సాధారణ ప్రేక్షకులతో పాటుగా సెలబ్రిటీలు కూడా ఈ ట్రైలర్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు దేవర విషయంలో కొరటాల ఓ విషయం దాచిపెడుతూ వచ్చాడు. ఆ విషయాన్ని ట్రైలర్ లో అయినా రివీల్ చేస్తాడా? ఇప్పటికైనా మమ్మల్ని కరుణిస్తాడా? అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
దేవర ట్రైలర్.. నేడు(సెప్టెంబర్ 10) రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ముంబైలో ఈ ట్రైలర్ లాంచ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే తారక్ అక్కడికి చేరుకున్నాడు. బాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు కూడా. ఇక ట్రైలర్ కు సంబంధించి కొన్ని లీకులు అయితే అందాయి. 2 నిమిషాల 50 సెకన్ల నిడివితో ట్రైలర్ కట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో తారక్ రెండు లుక్స్ కూడా చూపెట్టబోతున్నారట. పైగా యాక్షన్ కు పెద్ద పీట వేసినట్లు టాక్. మాస్ మసాలా అన్నీ కలిపి ప్రేక్షకుల ముందుకు అద్భుతమైన ట్రైలర్ ను తీసుకురాబోతున్నారు కోరటాల శివ అండ్ కో.
కాగా.. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఇప్పటి వరకు దేవర స్టోరీ ఏంటి? అన్నది ఇంత వరకు బయటకి రాలేదు. కానీ ప్రేక్షకులు మాత్రం రకరకాలుగా ఊహించుకుంటున్నారు. కొరటాల శివ ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ రాసుకున్నాడని ఒక వాదన వినిపిస్తోంది. దీంతో పాటుగా కారంచేడు ఊచకోతను ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిందని మరో వార్త కూడా వైరల్ గా మారింది. ఇక అసలు స్టోరీ ఏంటి అన్నది ఇప్పటి వరకు రివీల్ కాలేదు. గ్లింప్స్ లో గానీ, ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో గానీ కథను ఎక్కడా రివీల్ చేయలేదు కొరటాల శివ. కానీ తాజాగా విడుదల చేయబోయే ట్రైలర్ లో మాత్రం కచ్చితంగా కథ ఏంటన్నది చెప్పాల్సి ఉంటుంది. మరి ట్రైలర్ లో అయినా.. కొరటాల అసలు విషయం చెప్తాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉండగా.. డైరెక్టర్ కొరటాల శివకు ఓ మార్క్ రైటింగ్ ఉంది. తన ప్రతీ సినిమాలో ఓ సోషల్ మెసేజ్ కచ్చితంగా ఉంటుంది. దీంతో పాటుగా మూవీ స్టార్ట్ అయినప్పుడే టైటిల్ తోనే అది ఏ జోనరో చెప్పేస్తాడు. ఈ విషయం ఆయన గత సినిమాలు శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమా టైటిల్స్ చూస్తేనే అర్థమైపోతుంది. కానీ దేవర విషయంలో ఎలాంటి చిన్న క్లూ కూడా ఇవ్వకుండా జాగ్రత్త పడి.. అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించాడు. కానీ ఇప్పుడు తప్పక చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి కొరటాల శివ ఇప్పటికైనా ట్రైలర్ లో అసలు స్టోరీ ఏంటో చెప్తాడా? లేడా? అన్నది ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.