iDreamPost
android-app
ios-app

24 గంటలు దాటుతున్నా సలార్‌కు రేటింగ్‌ ఇవ్వని IMDB

సలార్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల దగ్గరి నుంచి కూడా మంచి రివ్యూలను తెచ్చుకుంది.

సలార్‌ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్ల దగ్గరి నుంచి కూడా మంచి రివ్యూలను తెచ్చుకుంది.

24 గంటలు దాటుతున్నా సలార్‌కు రేటింగ్‌ ఇవ్వని IMDB

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్‌’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ  బ్లాక్ బాస్టర్ టాక్ ని తెచ్చుకుంది. ఈ సినిమా తొలిరోజే 178 కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటికే అటు బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరూ సలార్ జపం చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ భారీ హిట్ కొట్టడంతో  ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఓ వారం దాటినా.. సలార్‌ టికెట్లు దొరకని పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సలార్ హౌస్‌ ఫుల్ కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ సినిమా విజయంతో ఫుల్‌ ఖుషీలో మునిగిపోయారు. అయితే, ఓ విషయంలో మాత్రం వారికి నిరాశ ఎదురైంది. ఆన్‌లైన్‌ సినిమా డేటా బేస్‌ సంస్థ IMDB ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నిరాశకు కారణం అయింది.  IMDB భారత్‌లో విడుదలయ్యే ప్రముఖ సినిమాలకు రేటింగ్‌లు ఇస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

కానీ, సలార్‌ విషయంలో మాత్రం IMDB రేటింగ్‌ ఇవ్వటంలో ఆలస్యం చేస్తోంది. ఇంకా సలార్‌ రేటింగ్‌ ఇ‍వ్వలేదు. సలార్‌ విడుదలై 24 గంటలు గడుస్తున్నా రేటింగ్‌ ఇవ్వలేదు. గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ ‘డంకీ ’ సినిమాకు మాత్రం వెంటనే రేటింగ్‌ ఇచ్చింది. విడుదలైన 5 గంటల్లోనే డంకీకి 7.5 రేటింగ్‌ను ప్రకటించింది. జవాన్‌ సినిమాతో పోలిస్తే డంకీకి IMDB అతి తక్కువ రేటింగ్ ఇచ్చింది. సలార్‌ విషయంలో మాత్రం ఎందుకో ఆలస్యం చేస్తోంది. ఇదే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను కొంత ఇబ్బందికి గురిచేస్తోంది. వెంటనే రేటింగ్‌ ఇవ్వాలని సోషల్‌ మీడియా వేదికగా వారు విజ్ఞప్తులు చేస్తున్నారు.

కాగా, ‍సలార్‌, డంకీ సినిమాలు ఓ రోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రశాంత్‌ నీల్‌ తీసిన సలార్‌.. రాజ్‌ కుమార్‌ హిరానీ తీసిన డంకీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అయితే, డంకీ.. సలార్‌ ముందు తేలిపోయింది. ప్రభాస్‌ స్టామినా ముందు నిలబడలేకపోయింది. కొన్ని థియేటర్లలో డంకీ మూవీని తీసేసి సలార్‌ను ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నార్త్‌లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. షారుఖ్‌ సొంత గడ్డ ముంబైలో కూడా సలార్‌ హవా నడుస్తోంది. నార్త్‌ ప్రేక్షకులు సలార్‌ను నెత్తిన పెట్టుకుంటున్నారు. మరి, సలార్ సినిమాకు రేటింగ్‌  ఇవ్వటంలో IMDB అలస్యం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.