ప్రభాస్ కొత్త మూవీలో ఇమాన్వీ.. ఆమెను సెలెక్ట్ చేయడానికి రీజన్ చెప్పిన డైరెక్టర్!

Hanu Raghavapudi On Imanvi Esmail: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్ అనే సోషల్ మీడియా సెన్సేషన్ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆమెను ఈ చిత్రంలో తీసుకోవడానికి గల కారణం ఏంటో రివీల్ చేశాడు డైరెక్టర్ హను రాఘవపూడి.

Hanu Raghavapudi On Imanvi Esmail: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రంలో ఇమాన్వీ ఎస్మాయిల్ అనే సోషల్ మీడియా సెన్సేషన్ నటించే ఛాన్స్ కొట్టేసింది. ఆమెను ఈ చిత్రంలో తీసుకోవడానికి గల కారణం ఏంటో రివీల్ చేశాడు డైరెక్టర్ హను రాఘవపూడి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఉండే క్రేజ్, బజ్ వేరే లెవల్ అనే చెప్పాలి. దీన్ని మరింత పెంచేందుకు స్టార్ కాస్టింగ్​ను తీసుకుంటారు. ప్రభాస్ సరసన టాప్ హీరోయిన్స్​ను దించుతారు. మూవీపై ఉన్న బజ్ మరింత పెరగడానికి ఇది హెల్ప్ అవుతుంది. కానీ హను రాఘవపూడి మాత్రం దీనికి భిన్నంగా ఓ కొత్తమ్మాయిని తీసుకొచ్చారు. ప్రభాస్​తో తాను తీస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా కోసం సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ ఇస్మాయిల్​ను హను ఎంపిక చేశారు. సడన్​గా ప్రభాస్ సరసన నటించే ఆఫర్ రావడంతో ఎవరీ ఇమాన్వీ అని అందరూ వెతకసాగారు. ఆమె డీటెయిల్స్ తెలుసుకునే పనిలో పడ్డారు. ఫస్ట్ ఫిల్మ్​కే ప్రభాస్​తో నటిస్తోందంటే.. ఆమె స్పెషాలిటీ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ విషయంపై దర్శకుడు హను రాఘవపూడి రియాక్ట్ అయ్యారు.

ప్రభాస్ మూవీలో ఇమాన్వీని ఎందుకు తీసుకున్నారో క్లారిటీ ఇచ్చారు హను రాఘవపూడి. ఆమె అందం, ప్రతిభ కలిగిన అమ్మాయి అని మెచ్చుకున్నారు. తన డ్యాన్స్ వీడియోలు చూస్తుంటానని.. మంచి భరతనాట్యం డ్యాన్సర్ అని ప్రశంసించారు. కళ్లతోనే తను ఎన్నో ఎక్స్​ప్రెషన్స్​ను పలికిస్తూ ఉంటుందని, ఆ టాలెంట్ చూసే ఇమాన్వీకి ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నానని హను రాఘవపూడి స్పష్టం చేశారు. ఆడిషన్స్, స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాతే ఆమెను సెలెక్ట్ చేశామని తెలిపారు. ఇమాన్వీని ఎంపిక చేయడం తన ఒక్కడి డెసిషన్ కాదన్న హను రాఘవపూడి.. మూవీ యూనిట్ మొత్తం నిర్ణయమని పేర్కొన్నారు.

‘ఈ రోజుల్లో కొత్త టాలెంట్​ను వెతికి పట్టుకోవాలంటే సోషల్ మీడియా సాయం తీసుకోవాల్సిందే. ప్రతిభ గల వారిని వెలికితీయడంలో ఇది ఎంతో యూజ్ అవుతోంది. స్టోరీకి అనుగుణంగా యాక్టర్స్​ను సెలెక్ట్ చేయడంలో ఫిల్మ్ మేకర్స్​కు సోషల్ మీడియా చాలా ఉపయోగపడుతోంది. అందం, టాలెంట్ కలిగిన అమ్మాయి ఇమాన్వీ. ఆమె అద్భుతమైన భరతనాట్యం డ్యాన్సర్. కళ్లతో ఆమె పలికించే ఎక్స్​ప్రెషన్స్ చూసే ఒక అవకాశం ఇవ్వాలని భావించా’ అని హను రాఘవపూడి వ్యాఖ్యానించారు. ఇక, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ప్రభాస్-హను ఫిల్మ్​కు ‘ఫౌజీ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇటీవలే పూజా కార్యక్రమంతో మొదలైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తర్వలో స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మరి.. ప్రభాస్-ఇమాన్వీ జోడీ సిల్వర్​స్క్రీన్​పై చేసే మ్యాజిక్ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments