iDreamPost
android-app
ios-app

భర్త ఫొటో షేర్‌ చేసిన ఇలియానా.. ట్విస్ట్‌ మాములుగా లేదుగా!

  • Published Jul 03, 2023 | 12:33 PM Updated Updated Jul 03, 2023 | 12:54 PM
  • Published Jul 03, 2023 | 12:33 PMUpdated Jul 03, 2023 | 12:54 PM
భర్త ఫొటో షేర్‌ చేసిన ఇలియానా.. ట్విస్ట్‌ మాములుగా లేదుగా!

దేవదాసు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా. టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. సౌత్‌లో మొదిటి సారి కోటి రూపాయలు పారితోషికం అందుకున్న హీరోయిన్‌గా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత బాలీవుడ్‌కి తన మకాం మార్చింది. అక్కడ మంచి చిత్రాల్లో నటించినా.. సౌత్‌లో వచ్చినంత గుర్తింపు మాత్రం రాలేదు. కెరీర్‌లో డౌన్‌ ఫాల్‌, బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌.. వంటి కారణాల వల్ల డిప్రెషన్‌కు గురైంది. ఆ బాధ నుంచి బయటపడి జీవితంలో నూతన అధ్యాయానికి తెర తీసింది. ప్రస్తుతం ఇల్లి బేబీ ప్రెగ్నెంట్‌. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఇలియానా.. ఓ రోజు సడెన్‌గా తాను ప్రెగ్నెంట్‌ అన్న విషయం పో​స్ట్‌ చేసి.. అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ తర్వాత బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ వచ్చింది.

అసలు ఇలియానా ప్రెగ్నెంట్‌ కావడం ఏంటి.. ఆమె భర్త ఎవరు.. అసలు గోవా బ్యూటీకి పెళ్లి ఎప్పుడు అయ్యింది అంటూ నెటిజనులు ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఆనీ ఇంత వరకు ఈ బ్యూటీ వీటికి సమాధానం చెప్పలేదు. ఇక తాజాగా ఇలియానా చేసిన ఓ పోస్ట్‌ తెగ వైరలవుతోంది. గోవా బ్యూటీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో భర్త ఫొటో షేర్‌ చేసి షాకిచ్చింది. అయితే అతను ఎవరు అనేది మాత్రం ఎవరికి అర్థం కావడం లేదు. కారణం ఈ ఫొటోలో ఇలియానా భర్త.. కుక్కకు ముద్దు పెడుతూ.. తల కిందకు దించి ఉన్నాడు. అతడి ముఖం సరిగా కనిపించడం లేదు. దాంతో ఇలియానా భర్త ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. ఈ ఫొటో చూసిన వారు.. బిడ్డ పుట్టాక.. తండ్రి, బిడ్డల ఫొటో ఒకేసారి షేర్‌ చేస్తుందేమో అని అంటున్నారు.

కొన్ని రోజుల క్రితం వరకు.. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో ఇలియానా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కత్రినా షేర్‌ చేసిన ఫొటోల్లో వీరిద్దరు కనిపించడంతో.. ఈ రూమర్లకు బలం చేకూరింది. ఇక సినిమా విషయానికి వస్తే.. ఇలియానా చివరగా అభిషేక్‌ బచ్చన్‌ నటించిన ది బిగ్‌ బుల్‌లో కనిపించింది. అజయ్‌ దేవగన్‌ నిర్మించిన ఈ చిత్రానికి కూకీ గులాటి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఇలియానా అన్‌ఫెయిర్‌ అండ్‌ లవ్లీలో రణదీప్‌ హుడాతో కలిసి నటించనుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetpipo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş