iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు రియల్ లవర్ ను పరిచయం చేసిన హైపర్ ఆది! ఎవరంటే?

  • Author Soma Sekhar Published - 07:58 PM, Mon - 14 August 23
  • Author Soma Sekhar Published - 07:58 PM, Mon - 14 August 23
ఎట్టకేలకు రియల్ లవర్ ను పరిచయం చేసిన హైపర్ ఆది! ఎవరంటే?

హైపర్ ఆది.. ఈ పేరు వినగానే ఫటా ఫట్ పంచులతో పాటు డబుల్ మీనింగ్ డైలాగ్సే గుర్తుకు వస్తాయి. జబర్దస్త్ కు ఆది వచ్చిన తర్వాత ఓ లెక్క.. రాక ముందు ఓ లెక్క అంటే అతిశయోక్తికాదేమో. ఇక అతి తక్కువ కాలంలోనే తనదైన పంచులతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఆది. జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తో పలు షోలతో పాటుగా పెద్ద పెద్ద స్టార్ల సినిమాల్లో కూడా నటించే ఛాన్స్ లు దక్కించుకుంటున్నాడు. అయితే ఇన్ని రోజులుగా బుల్లితెరపై ఎంతో మంది అమ్మాయిలతో జోడీ కట్టిన ఆది.. ఎట్టకేలకు తన రియల్ లవర్ ను పరిచయం చేశాడు. తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన అమ్మాయి ఇక్కడే ఉందని ఆమెను స్టేజిపైకి పిలిచి అందరిని ఆశ్చర్యపరిచాడు.

హైపర్ ఆది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి యాంకర్ వర్షిణితో పెళ్లి వార్త కాగా.. మరోటి భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇచ్చిన స్పీచ్. అయితే ఇందులో పెళ్లి వార్తపై యాంకర్ వర్షిణి ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మరోసారి వార్తల్లోకి ఎక్కాడు పంచుల రారాజు. ఇప్పటి వరకు షోల కోసం ఎంతో మంది లవర్ గా యాక్ట్ చేశారని, కానీ ఈ రోజు నా రియల్ లవర్ ను పరిచయం చేస్తానని చెప్పి తన లవర్ ను బుల్లితెర ద్వారా ఈ ప్రపంచానికి పరిచయం చేశాడు.

తాజాగా ఆగస్టు 20వ తారీఖుకు సంబంధించిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో తన రియల్ లవర్ ను స్టేజిపైకి పిలిచి మరీ అందరికి పరిచయం చేశాడు ఆది. స్టేజిపై ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఐ లవ్ యూ నిహారిక అంటూ మోకాలిపై కూర్చుని ప్రపోజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఆది రియల్ లవర్ నిహారికకు సంబంధించిన వివరాలు ఎక్కువగా చెప్పలేదు. ఇక ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే ఆగస్టు 20 వరకు ఆగాల్సిందే.


ఇదికూడా చదవండి: హైపర్ ఆది స్పీచ్ చిరుకి శాపం అయ్యిందా? మంచోడిని ముంచేశాడు!

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş