iDreamPost
android-app
ios-app

శక్తి, షాడో అంటూ డైరెక్టర్ పై ట్రోల్స్! షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది!

  • Author ajaykrishna Published - 02:41 PM, Wed - 12 July 23
  • Author ajaykrishna Published - 02:41 PM, Wed - 12 July 23
శక్తి, షాడో అంటూ డైరెక్టర్ పై ట్రోల్స్! షాకింగ్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది!

టీవీ స్క్రీన్ పై కమెడియన్ గా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన ఆది.. ఇప్పుడు ఫుల్ టైమ్ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు. అందుకే వచ్చిన అవకాశాలను వదులుకోకుండా తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రెజెంట్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ లో ఆది నటిస్తున్నాడు. కాగా.. తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక సాంగ్ లాంచ్ లో పాల్గొన్న ఆది.. డైరెక్టర్ మెహర్ రమేష్ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు.

హైపర్ ఆది మాట్లాడుతూ.. “జామ్ జామ్ జజ్జనక సాంగ్ నాకు చాలా స్పెషల్. ఈ సాంగ్ షూటింగ్ టైంలో నా బర్త్ డే జరిగింది. అప్పుడు మెగాస్టార్ సమక్షంలో నా బర్త్ డే జరుపుకునే అవకాశం వచ్చింది. డైరెక్టర్ మెహర్ రమేష్ అనగానే చాలామంది శక్తి, షాడో అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. కానీ.. ఇండియన్ సినిమాకి పేరు తెచ్చిన ప్రభాస్ కి.. కెరీర్ లో మోస్ట్ స్టైలిష్ మూవీ బిల్లా అంటారు. ఆ మూవీ తీసింది ఈయనే. అలాగే స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్య లేరు. కానీ.. ఆయన నటించిన బెస్ట్ మూవీస్ లో వీరకన్నడిగ ఒకటి. ఆ మూవీ తీసింది కూడా మెహర్ రమేష్..

ఒక విషయం.. ఫెయిల్యూర్స్ వల్లే ట్రోల్ చేయాల్సి వస్తే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ట్రోల్ చేయాలి. ఫెయిల్యూర్ లేని మనిషి అంటూ ఉండరు. దేనికైనా టైం రావాలంతే. జనరల్ గా మనం భోజనం చేసేటప్పుడు ఢీ, వెంకీ, దుబాయ్ శీను, బాద్షా లాంటి సినిమాలలో కామెడీ పెట్టుకుని ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత ప్లాప్స్ ఇచ్చారని డైరెక్టర్ శ్రీను వైట్లని తక్కువ చేయలేము. సెంచరీల మీద సెంచరీలు కొట్టే కోహ్లీ కూడా ఇటీవల సింగిల్ సెంచరీ కొట్టడానికి టైం తీసుకున్నాడు. ఇన్నాళ్లు మెహర్ రమేష్ మీద వచ్చిన ట్రోల్స్ అన్నీ.. ఈ భోళా శంకర్ సినిమాకి బ్లెస్సింగ్స్ గా మారుతాయని కోరుకుంటున్నాం” అని ఆది చెప్పుకొచ్చాడు. మరి హైపర్ ఆది మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobetJojobet Giriş