iDreamPost
android-app
ios-app

భారతీయుడు 2.. తమిళంలో కన్నా తెలుగులో బెటర్ గా! ఇది మన లవ్!

  • Published Jul 10, 2024 | 5:21 PM Updated Updated Jul 10, 2024 | 5:21 PM

Huge Response For Bharateeyudu 2 From Telugu States: కమల్ హాసన్- డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

Huge Response For Bharateeyudu 2 From Telugu States: కమల్ హాసన్- డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న భారతీయుడు 2 సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమిళనాడుతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది.

  • Published Jul 10, 2024 | 5:21 PMUpdated Jul 10, 2024 | 5:21 PM
భారతీయుడు 2.. తమిళంలో కన్నా తెలుగులో బెటర్ గా! ఇది మన లవ్!

దాదాపు 28 ఏళ్ల తర్వాత సేనాపతి మరోసారి వెండితెర మీద తన దేశభక్తిని చాటుకోనున్నాడు. 1996లో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్లు డైరెక్టర్ శంకర్ భారతీయుడు సినిమా తెరకెక్కించాడు. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ మోడ్రన్ సేనాపతిని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఎన్నో అప్ డేట్స్ వచ్చాయి. సినిమా నుంచి టీజర్, సాంగ్స్, ట్రైలర్ కూడా వచ్చేసింది. మరో రెండ్రోజుల్లో సినిమా విడుదల కూడా కాబోతోంది. కానీ, తమిళనాడులో మాత్రం ఆ హడావుడి కనిపించడం లేదు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం భారతీయుడు హవా నెక్ట్స్ లెవల్లో ఉంది.

కమల్ హాసన్- డైరెక్టర్ శంకర్ ఇద్దరికి కూడా ఈ భారతీయుడు 2 సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే భారతీయుడు చిత్రంతో ఈ ఇద్దరూ దేశాన్ని ఊపేశారు. ఇప్పుడు ఆ ట్రెండ్ ని మళ్లీ రిపీట్ చేయడానికి రెడీ అయిపోయారు. అంతేకాకుండా.. భారతీయుడు కేవలం రెండు పార్ట్స్ మాత్రమే కాదు.. పార్ట్ 3 కూడా ఉంది. ఇప్పటికే భారతీయుడు 3 సినిమా పనులు కూడా స్టార్ట్ చేశాం అని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే భారతీయుడు 2 మీద ఎంతో నమ్మకం ఉంటేనే సినిమా రిలీజ్ కాకుండానే పార్ట్ 3కి వెళ్తారు. అలాంటి సినిమాకి సంబంధించి తమిళనాట అంత హడావుడి కనిపించడం లేదు.

బుక్ మై షోలో భారతీయుడు 2 సినిమాకి షోస్ చెన్నైలో టికెట్స్ రిలీజ్ చేశారు. టికెట్స్ అయితే ఫిల్ అవుతున్నాయి. కానీ, అనుకున్నంత వేగంగా మాత్రం టికెట్స్ ఫిల్ అవుతున్నట్లు అనిపించడం లేదు. నిజానికి తమిళనాట ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ ఇంకా ఎక్కువ ఉండాల్సింది. కానీ, ఈసారి ఆ ఆసక్తి, ఆతురత తెలుగు ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. ఇండియన్ 2 సినిమా కోసం తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ ఎప్పుడు టికెట్స్ రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఇండియన్ 2 టీమ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ పూర్తి చేసుకుంది. మొదటి నుంచి ఈ సినిమాకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మూవీ టీమ్ రిలీజ్ చేసిన తెలుగు అప్ డేట్స్ అన్నీ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఇంక సినిమాకి బ్రేక్ ఇవ్వడమే ఆలస్యం అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. మరి.. 28 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ భారతీయుడు సీక్వెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio