iDreamPost
android-app
ios-app

Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 4 కోట్ల నష్టం..!

  • Published May 10, 2024 | 8:31 AM Updated Updated May 10, 2024 | 8:31 AM

కళ్యాణ్‌ రామ్‌ 21వ సినిమా షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీని వల్ల సుమారు 4 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది అంటున్నారు. ఆ వివరాలు..

కళ్యాణ్‌ రామ్‌ 21వ సినిమా షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. దీని వల్ల సుమారు 4 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది అంటున్నారు. ఆ వివరాలు..

  • Published May 10, 2024 | 8:31 AMUpdated May 10, 2024 | 8:31 AM
Kalyan Ram: కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 4 కోట్ల నష్టం..!

వేసవికాలంలో అగ్ని ప్రమాదాల తీవ్రత భారీగా పెరుగుతుంది. నిత్యం ఏదో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. వేసవి కాలం.. ఎండలు మండుతుండటం.. అధిక ఉష్ణోగ్రతలు.. వంటి కారణాల వల్ల చిన్న అజాగ్రత్త కూడా భారీ ప్రమాదాలకు దారి తీస్తుంది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలతో సహా.. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక వీటివల్లపెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. నందమూరి కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి నటిస్తున్న చిత్రం షూటింగ్‌ స్పాట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని.. 4 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు..

నందమూరి కళ్యాణ్‌ రామ్‌ చివరగా నటించిన సినిమా డెవిల్‌. భారీ బడ్జెట్‌, అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద అనుకున్న మేర రాణించలేదు. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం కళ్యాణ్‌ రామ్‌ మరో భారీ బడ్జెట్‌ సినిమాలో నటిస్తున్నాడు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రలో కళ్యాణ్‌ రామ్‌తో పాటు విజయశాంతి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు అని టాక్‌. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్‌ సెట్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. . ఈ చిత్రంలో సీబీఐకి సంబందించిన సన్నివేశాలు కీలకం కాబోతున్నాయట. దీనితో ప్రత్యేకంగా సిబిఐ ఆఫీస్ సెట్‌ని నిర్మించారు. పది రోజుల పాటు ఈ సెట్‌లో షూటింగ్ జరగాల్సి ఉంది. ఇప్పటికే 9 రోజుల షూటింగ్‌ జరిగింది. ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించగా.. మరి కొంత భాగం పెండింగ్‌లో ఉందంట.

ఇటీవల చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి చేసుకుని సెట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాత్రి 8 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీని గురించి చిత్ర యూనిట్‌కి సమాచారం అందించే లోపు సెట్‌ అంతా కాలి బూడిదైపోయింది. ప్రమాదం గురించి తెలుసుకున్న చిత్ర బృందం ఘటనా స్థలానికి వెళ్లేలోపే అక్కడంతా కాలి బూడిదయ్యిందని.. సెట్ కాలిపోవడం వల్ల నిర్మాతకి సుమారు 4 కోట్ల నష్టం అని అంచనా వేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

తన కెరీర్‌లో 21వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్‌ రామ్‌ సరసన సాయి మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు అంజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచిపోనుందని.. ఆయన చాలా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet