iDreamPost
android-app
ios-app

ప్రభాస్ కల్కి కోసం భారీ క్లైమాక్స్!

  • Published Feb 05, 2024 | 5:14 PM Updated Updated Feb 05, 2024 | 5:14 PM

Kalki Movie: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kalki Movie: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా ప్రభాస్ నటిస్తోన్న కల్కి చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Feb 05, 2024 | 5:14 PMUpdated Feb 05, 2024 | 5:14 PM
ప్రభాస్ కల్కి కోసం భారీ క్లైమాక్స్!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2898 AD సినిమాని పాన్-ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ మరియు అద్భుతమైన స్టార్ కాస్ట్‌తో పాటు, ఈ చిత్రం సాంకేతికత మరియు హిందూ ఇతిహాసాల, పురాణల కలయికగా రానుంది. కాగా ఈ సినిమాలో  అత్యున్నత స్థాయిలో గ్రాఫిక్స్ తో పాటు సాంకేతిక విలువలు కలిగి ఉండేలా చిత్ర బృందం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇటీవలి కాలంలో భారీ హైప్ ను కలిగి ఉన్న సినిమాల్లో కల్కి 2898 AD కూడా ఒకటి. పైగా ఇటీవలే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ విజయం సాధించడంతో ప్రభాస్ అభిమానుల ఉత్సాహం మరింత ఎక్కువైంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కల్కి 2898 AD సినిమా యొక్క క్లైమాక్స్ గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ చిత్రం యొక్క క్లైమాక్స్ భారతీయ చలనచిత్రంలో మునుపెన్నడూ లేనంత భారీగా గొప్పగా ఉంటుందట. వచ్చే వారం నుంచి క్లైమాక్స్‌ షూట్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం. క్లైమాక్స్ షూట్‌లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిషా పటానీ, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని మరియు మరికొంత మంది తారలు పాల్గొంటారని తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని వంటి హీరోలు ముఖ్య అతిథి పాత్రలు పోషించారట. ఇక దేశానికే గర్వకారణంగా నిలిచిన నటుడు కమల్ హాసన్ ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత చిత్ర యూనిట్ వరుసగా అప్‌డేట్‌లు ఇవ్వడం ప్రారంభిస్తుందని సమాచారం. మరి..సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş