iDreamPost
android-app
ios-app

Prabhas: ప్రభాస్ ప్రాజెక్ట్స్ లో మార్పులు? క్రేజీ మూవీ వెనక్కి వెళ్లిందా?

  • Published Jul 18, 2024 | 1:17 PM Updated Updated Jul 18, 2024 | 1:17 PM

కల్కి హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. అయితే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

కల్కి హిట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. అయితే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Jul 18, 2024 | 1:17 PMUpdated Jul 18, 2024 | 1:17 PM
Prabhas: ప్రభాస్ ప్రాజెక్ట్స్ లో మార్పులు? క్రేజీ మూవీ వెనక్కి వెళ్లిందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. విడుదలైన రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల క్లబ్ లోకి చేరి.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పటికీ ఎన్నో రికార్డులు బద్దలు కొడుతూ.. దూసుకెళ్తోంది. ఇక కల్కి సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం యూరప్ వెకెషన్లో ఎంజాయ్ చేస్తున్నాడు డార్లింగ్. ఇండియా తిరిగొచ్చిన తర్వాత వెంటనే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ లో బిజీ అయిపోతాడు. అయితే.. ప్రభాస్ తర్వాత సినిమాల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’,  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’, హనురాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలు చేస్తున్నాడు. ఇక వెకేషన్ నుంచి తిరిగి రాగానే మారుతి రాజా సాబ్ మిగిలిపోయిన షూటింగ్ పాల్గొంటాడు. ఆ తర్వాత స్పిరిట్ మూవీ చేయాల్సి ఉంది. కానీ ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అలాగే స్క్రిప్ట్ పనులు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదీకాక హనురాఘవపూడి ఫౌజీ మూవీ షూటింగ్ ను అక్టోబర్ లో ప్లాన్ చేస్తున్నాడు. దాంతో ఈ లైనప్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాగా.. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ వెనక్కి వెళ్లి.. ఫౌజీ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో స్పిరిట్ మూవీ షూటింగ్ ప్రారంభం అవ్వనున్నట్లు తెలుస్తోంది. అదీకాక పోతే.. రెండు సినిమాలను సమాంతరంగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ఇక ఫౌజీ మూవీ 1940 కాలం నాటి మూవీ కావడంతో ప్రభాస్ దానికి ఎక్కువ డేట్స్ ను కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ పీరియాడికల్ డ్రామాలో ప్రభాస్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫౌజీ మూవీలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నాడు. చూడాలి మరి ప్రభాస్ లైనప్ లో ఏ మార్పులు జరుగుతాయో.

Jojobet Girişjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet