iDreamPost
android-app
ios-app

దేవర నెక్స్ట్ సాంగ్ పై సూపర్ హైప్.. ఫియర్ సాంగ్ కు మించి ఉంటుందంటూ!

  • Published Aug 10, 2024 | 10:53 AM Updated Updated Aug 10, 2024 | 10:53 AM

Devara Third Song Update: తారక్ అభిమానుల ఆశలన్నీ దేవర సినిమా పైనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొకటి మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ తో సినిమాపై రోజు రోజుకి హైప్ పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా దేవర నెక్ట్ సాంగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Devara Third Song Update: తారక్ అభిమానుల ఆశలన్నీ దేవర సినిమా పైనే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొకటి మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ తో సినిమాపై రోజు రోజుకి హైప్ పెరిగిపోతుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా దేవర నెక్ట్ సాంగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Published Aug 10, 2024 | 10:53 AMUpdated Aug 10, 2024 | 10:53 AM
దేవర నెక్స్ట్ సాంగ్ పై సూపర్ హైప్.. ఫియర్ సాంగ్ కు మించి ఉంటుందంటూ!

ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ ఇప్పటివరకు స్క్రీన్ పైన కనిపించలేదు. దీనితో అభిమానులంతా ఎప్పుడెప్పుడు తారక్ మూవీ రిలీజ్ అవుతుందా అని చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తారక్ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కానీ దానిని సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేస్తున్నారు. ఇక ఇప్పుడు తారక్ అభిమానుల ఆశలన్నీ కూడా దేవర సినిమా మీదే ఉన్నాయి. మరి కొద్దీ రోజుల్లోనే ఈ సినిమా విడుదల కానున్న క్రమంలో.. సినిమా నుంచి ఒక్కొకటిగా అప్ డేట్స్ రిలీజ్ అవుతూ ఉన్నాయి. ప్రతి అప్ డేట్ కూడా దేవరపై అంతకుమించిన అంచనాలను క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు దేవర నుంచి రానున్న నెక్ట్ సాంగ్ గురించి.. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇప్పటికే దేవర సినిమా నుంచి రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తారక్ కట్ అవుట్ కు తగినట్లు దేవర ముందర నువ్వెంత అంటూ.. మొదట ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ కావడంతోనే .. దేవరతో తారక్ హిట్ కొట్టడం పక్కా అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా దేవర నుంచి అప్ డేట్స్ మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఇక లేటెస్ట్ గా ‘చుట్టమల్లే’ సాంగ్ రిలీజ్ చేయగా.. స్లో గా అందరిని మెప్పించేస్తూ.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఈ పాట. ఈ క్రమంలో ఇప్పుడు ఈ మూవీ నుంచి రానున్న మరొక సాంగ్ గురించి.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే దేవర నుంచి నెక్ట్ రాబోయే పాట ఆయుధ పూజ పాట అంటూ.. ఈ సాంగ్ ఫియర్ సాంగ్ కంటే ఎక్కువ హైప్ ను క్రియేట్ చేయనుందని.. సమాచారం. ఇక అంతే కాకుండా ఈ సాంగ్ మొత్తం సినిమాకే హైలెట్ కానుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సాంగ్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇంకా రావాల్సి ఉంది.

Devara

ఇక దేవర హైప్ లో ప్రస్తుతం అభిమానులంతా ఉండగానే.. తారక్ తన నెక్ట్ సినిమాను స్టార్ట్ చేసి.. అభిమానులను సర్ప్రైజ్ చేశారు. తాజాగా ప్రశాంత్ నీల్ – తారక్ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూజ కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే. మూవీ స్టార్ట్ చేయడమే కాకుండా సినిమా ఎప్పుడు రిలీజ్ కాబోతుందో కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇలా రానున్న రెండేళ్లలో తారక్ భారీ ప్రాజెక్ట్స్ తో అభిమానులను ఎంటర్టైన్ చేయనున్నారు. ఇక దేవర సినిమా రిలీజ్ కు ఇంకా కొద్దీ రోజులు సమయం మాత్రమే మిగిలి ఉండడంతో.. మేకర్స్ రిలీజ్ పనులను వేగవంతంగా కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో దేవర నుంచి వచ్చే అప్ డేట్స్ సినిమాపై ఎలాంటి అంచనాలు పెంచుతాయో వేచి చూడాలి. మరి దేవర థర్డ్ సాంగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişmadridbet güncel girişmadridbet