Swetha
తారక్ ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ తో కలిసి మల్టిస్టారర్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుందట. ఆ విషయాలేంటో చూసేద్దాం.
తారక్ ను ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ తో కలిసి మల్టిస్టారర్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుందట. ఆ విషయాలేంటో చూసేద్దాం.
Swetha
హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబోలో వచ్చిన వార్ మూవీకి హ్యుజ్ రెస్పాన్స్ లభించింది. దీనితో ఇప్పుడు వార్ 2 మూవీని హృతిక్ తారక్ కాంబోలో తీస్తున్నారు. ఈ కాంబో అనౌన్స్ చేసినప్పటినుంచి అభిమానులలో ఆసక్తి నెలకొంది. బాలీవుడ్‌లో తారక్ పేరు మోత మోగిపోతుంది. ఇప్పటికే వార్ 2 షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. అలాగే మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ కు ముందే రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 300 కోట్లు. కాగా ప్రీరిలీజ్ ద్వారానే ఏకంగా 200 కోట్లు రాబట్టాలని మూవీ టీం భావిస్తుందంట. ఒకవేళ అదే కనుక జరిగితే రిలీజ్ కు ముందే ఈ సినిమా భారీ సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. సో ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ మీద ద్రుష్టి పెట్టారు. విదేశాలలో కూడా ఈ మూవీ ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఎలాగూ జూనియర్ ఎన్టీఆర్ కు చైనా , జపాన్ లో కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. సో అక్కడ మూవీ ప్రమోషన్స్ చాలా ఈజీ అని చెప్పి తీరాల్సిందే. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కనుక రిలీజ్ కు ముందే.. వార్ 2 లాభాలు చూసినట్లే. ఈ సినిమాను యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఆగష్టు 14 ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మూవీ టీజర్ , ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకెంత రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.