Swetha
OTT Suggestions : ఓటిటి లో ప్రతి వారం చాలానే సినిమాలు వస్తూనే ఉంటాయి. కంటెంట్ బావుంటే అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అందులోను తెలుగులో వచ్చే సినిమాలను అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు. ఇక మలయాళ డబ్బింగ్ సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

ఓటిటి లో ప్రతి వారం చాలానే సినిమాలు వస్తూనే ఉంటాయి. కంటెంట్ బావుంటే అన్ని భాషల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అందులోను తెలుగులో వచ్చే సినిమాలను అసలు మిస్ కాకుండా చూస్తూ ఉంటారు. ఇక మలయాళ డబ్బింగ్ సినిమాల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా మోహన్ లాల్ నటించిన ఓ మలయాళ మూవీ ఓటిటి లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. మోహన్ లాల్ క్లౌడ్ కిచెన్ నడుపుతూ ఉంటాడు. ఇతనికి గుండె సమస్య ఉంది. ఓ రోజు పూణేలో ఉండే కర్నల్ రవిచంద్రన్ ఓ యాక్సిడెంట్ లో చనిపోతాడు. దీనితో అతని హార్ట్ తీసి ఇతనికి పెడతారు. కొద్దీ రోజులకు సందీప్ దగ్గరకి కర్నల్ కూతురు హరిత వచ్చి.. నిశ్చితార్దానికి ఇన్వైట్ చేస్తుంది. అలా సందీప్ పూణే కు వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది ? చివరకు ఏమైందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అలంటి వాటిలో ఇది కూడా ఒకటి. ఈ సినిమా పేరు హృదయ పూర్వం. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ వీకెండ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే ఈ సినిమా బెస్ట్ చాయిస్. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.