Raj Mohan Reddy
తొలిరోజు హిట్ -3 కలెక్షన్స్ అదిరిపోయాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్స్ నమోదు అయ్యాయి. ఒకవైపు మూవీ యూనిట్ ఇది మాస్ కోసం తీసిన సినిమా అని చెప్తున్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హిట్-3 చూడటానికి ఎగబడ్డారు. ఫలితంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి
తొలిరోజు హిట్ -3 కలెక్షన్స్ అదిరిపోయాయి. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ నంబర్స్ నమోదు అయ్యాయి. ఒకవైపు మూవీ యూనిట్ ఇది మాస్ కోసం తీసిన సినిమా అని చెప్తున్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హిట్-3 చూడటానికి ఎగబడ్డారు. ఫలితంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి
Raj Mohan Reddy
నాని లెక్క మార్చాడు. క్లాస్ నుండి మాస్ కి గేర్ షిఫ్ట్ చేశాడు. దసరా మూవీ దీనికి తొలిమెట్టు. అక్కడ సక్సెస్ అయ్యాడు. ఆ తరువాత సరిపోదా శనివారం… సరిపోయే అంత సక్సెస్ కిక్ ఇచ్చింది. ఇప్పుడు హిట్-3 వంతు. గురువారం రిలీజ్ అయిన మూవీ తొలిరోజు మాస్ వసూళ్లు సాధించింది. తొలిరోజు ఏకంగా 43 కోట్లకి పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఇది నాని కెరీర్ హయ్యెస్ట్. దసరా మూవీ డే1 లెక్కల్లో 40 కోట్ల బోర్డర్ లో ఆగిపోయింది. ఇపుడు ఆ గీత దాటేశాడు నాని. రిలీజ్ రోజు హాలిడే ఉండటం, హిట్ ఫ్రాంచైజీ పై మంచి బజ్ ఉండటం, అన్నిటికీ మించి ఫస్ట్ షో పడ్డ క్షణం నుండే పాజిటివ్ టాక్ రావడం వంటి అంశాలు భారీ ఓపెనింగ్స్ కి కారణం అయ్యాయి.
ఫస్ట్ వీకెండ్ కి ఇంకా 3 రోజుల సమయం ఉంది. బుకింగ్స్ అన్నీ పాజిటివ్ గా కనిపిస్తున్నాయి. డే 4 వరకు ఇదే ఊపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే నాని కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టేసినట్టే అని ట్రేడ్ ఒక అంచనాకి వచ్చేసింది. నిజానికి గత కొన్ని నెలల నుండి ఇండస్ట్రీ బ్యాడ్ ఫేజ్ లో ఉంది. పెద్ద సినిమాల రిలీజ్ లు లేవు. వస్తున్న చిన్న సినిమాలు ఆడటం లేదు . మధ్యలో కోర్ట్ మూవీ కాస్త పర్లేదు అనిపించింది. కానీ.. అది చిన్న సినిమా. చిన్న సక్సెస్. ఆ ఒక్క సక్సెస్ తో బయ్యర్స్ యాక్టీవ్ కాలేరు కదా..? అందుకే మళ్ళీ నాని స్వయంగా రంగంలోకి దిగాడు. మాస్ ఆడియన్స్ తో పాటు.., ఫ్యామిలీ ఆడియన్స్ ధియేటర్స్ కి క్యూ కట్టారు. కుర్రాళ్ళు కూడా IPL ని వదిలి.. సినిమా హాల్స్ వైపు అడుగులు వేశారు. హిట్-3 మూవీకే కాదు ఇండస్ట్రీకి ఇది నిజంగా పెద్ద ప్లస్.
దిల్ రాజు అన్నట్టు నాని ఇప్పుడు ఇండస్ట్రీ పాలిట దేవుడు. ఈ ఊపుని మాత్రం పరిశ్రమ కాపాడుకోవాల్సి ఉంది. ఇక చాలా తక్కువ సమయంలోనే పెద్ద సినిమాలు రాబోతున్నాయి. బయ్యర్స్ కూడా ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. సో.. ఇండస్ట్రీలో మళ్ళీ వెలుగులు మొదలయ్యాయి. అంతా నాని పుణ్యం. ఇదంతా ఓకే గాని.. రెట్రోతో మాత్రం సూర్య షాక్ ఇచ్చాడు. అలాంటి స్టార్ నుండి ఆశించే మూవీ కాదు అది. హిట్-3 కి ఇది కలసి వచ్చే అంశమే. కానీ.. రెట్రో కూడా హిట్ అయ్యుంటే బాగుండేది. మరోవైపు నాని దెబ్బకి రైడ్-2 ధియేటర్స్ కూడా ఖాళీ చేసి.., హిట్-3 ఆడించాల్సిన పరిస్థితి. సో.. గ్రౌండ్ లో నాని ఒక్కడే ఉన్నాడు. ఓపెనింగ్ అదిరింది. లాంగ్ వీకెండ్ ముందు ఉంది. పైగా.. సమ్మర్ హాలిడేస్. కుర్రాళ్ళు అంతా మంచి సినిమా కోసం కసిగా ఉన్నారు. సో.. హిట్-3 నంబర్స్ చాలా పెద్దగా ఉండబోతున్నాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. కంగ్రాట్స్ న్యాచురల్ స్టార్ నాని.