iDreamPost
android-app
ios-app

హాయ్ నాన్న డైరెక్టర్.. నెక్స్ట్ ఆ స్టార్ హీరోతో…!

  • Published Jul 07, 2024 | 4:21 PM Updated Updated Jul 07, 2024 | 4:21 PM

హాయ్ నాన్న మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శౌర్యువ్. సినిమా రిలీజై ఆరు నెలలు దాటిపోయినా.. అతడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ కాలేదు. అయితే ఇప్పుడొక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

హాయ్ నాన్న మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు శౌర్యువ్. సినిమా రిలీజై ఆరు నెలలు దాటిపోయినా.. అతడి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ కాలేదు. అయితే ఇప్పుడొక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది.

  • Published Jul 07, 2024 | 4:21 PMUpdated Jul 07, 2024 | 4:21 PM
హాయ్ నాన్న డైరెక్టర్.. నెక్స్ట్ ఆ స్టార్ హీరోతో…!

ఈ మధ్య కాలంలో యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటారు. విమల్ కృష్ణ (డీజే టిల్లు), కార్తీక్ వర్మ దండు(విరూపాక్ష), బింబిసార (వశిష్ట మల్లిడి), ప్రశాంత్ వర్మ వంటి కాస్తంత అనుభవం ఉన్న దర్శకులే కాకుండా జబర్థస్ట్ వేణు (బలగం), శ్రీకాంత్ ఓదెల (దసరా), హాయ్ నాన్న (శౌర్యువ్) వంటి డైరెక్టర్లు సైతం తమ సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసేశారు. కొత్త దర్శకులకు మార్గ నిర్దేశకులయ్యారు. స్టార్లు సైతం వీరితో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే గత ఏడాది చివరిలో విడుదలై.. ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం హాయ్ నాన్న. నాని, మృణాల్ ఠాకూర్ నటించగా..  బేబి కియారా తన నటనతో మెస్మరైజ్ చేసింది.

 న్యాచురల్ స్టార్ నానికి దసరాతో మాస్ ఇమేజ్ రాగా, హాయ్ నాన్నతో క్లాస్ హిట్ అందించాడు దర్శకుడు కమ్ రచయిత శౌర్యువ్.  అతడి టేకింగ్ స్టైల్‌కు  ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కథతో పాటు కథనం కూడా హాయిగా, ఎక్కడ బోరు కొట్టించకుండా ఉంటుంది. తండ్రి, కూతుళ్ల మధ్య బంధం, భార్యా భర్తల బాండింగ్ ను సరికొత్తగా ఆవిష్కరించాడు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డా. విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మించారు. ఈ సినిమా రూ. 76 కోట్లను కొల్లగొట్టింది. కాగా, శౌర్యవ్ నుండి మరో ప్రాజెక్ట్ ఎనౌన్స్ కాలేదు. అయితే ఇప్పుడు మరో సినిమా కథను రెడీ చేసినట్లు తెలుస్తుంది. హాయ్ నాన్నతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరిస్తే.. ఈ సారి యాక్షన్ డ్రామా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట శౌర్యువ్.

 ఈ మేరకు కథను సిద్దం చేసుకున్నాడని తెలుస్తుంది. ఈ సారి స్క్రీన్ ప్లేతో అల్లాడిస్తాడట. ఈ మూవీలో డ్రామా,భావోద్వేగాలు హాయ్ నాన్న కన్నా వెయ్యి రెట్లు ఎక్కువ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.  తన తదుపరి సినిమాను కూడా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ తెరరకెక్కించబోతుందని తెలుస్తోంది. తనకు నిర్మాతలు మంచి సపోర్టు ఇస్తుండటంతో.. ఈ ప్రొడక్షన్లలోనే సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే స్క్రీన్ ప్లే రైటింగ్ అయిపోయిందట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే తన తదుపరి సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. ఆయనతో నెక్ట్స్ ప్రాజెక్టు చేయాలని భావిస్తున్నాడట. అందుకు తగ్గట్లుగా యాక్షన్ సీక్వెన్స్ రాసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి మాసెస్ ఆఫ్ ది మ్యాన్ తారక్ అయితే న్యాయం చేయగలడని అనుకుంటున్నాడట దర్శకుడు. ఈ నేపథ్యంతో యంగ్ టైగర్‌తో తన తదుపరి సినిమా కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet