Venkateswarlu
తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీనుంచి దూరంగా వెళ్లిపోయారు. ముగ్గురు పిల్లలు పుట్టి కొంచెం పెద్దగా అయిన..
తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీనుంచి దూరంగా వెళ్లిపోయారు. ముగ్గురు పిల్లలు పుట్టి కొంచెం పెద్దగా అయిన..
Venkateswarlu
తెలుగు వారికి మాత్రమే కాదు.. దేశంలోని సినిమా ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు రంభ. దాదాపు 30 ఏళ్ల క్రితం సినిమా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె దాదాపు దేశంలోని టాప్ చిత్ర పరిశ్రమల్లో సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, భోజ్‌పురి, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేశారు. దాదాపు 100 సినిమాల్లో నటించారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇంద్రకుమార్ పద్మనాధన్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడారు.
తర్వాత సినిమాలకు దూరం అయ్యారు. దాదాపు 7 ఏళ్ల పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీనుంచి దూరంగా వెళ్లిపోయారు. ముగ్గురు పిల్లలు పుట్టి కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్లీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ వైపు వచ్చారు. సినిమాల్లో నటించటం మానేసినప్పటికి పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో షోలు చేశారు. తాజాగా, రంభ రీ ఎంట్రీకి సంబంధించి ఓ వార్త మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాదాపు 13 ఏళ్ల తర్వాత ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంట.
అది కూడా తెలుగు సినిమాతోనే రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. టాలీవుడ్‌కు చెందిన ఓ బడా హీరో సినిమాలో నటించనున్నారట. ఆ బడా హీరో ఎవరు? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికి రంభ రీ ఎంట్రీ వార్త ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. కాగా, రంభ 1992లో వచ్చిన ‘ ఆ ఒక్కటి అడక్కు’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో పెద్ద హిట్‌ను సొంతం చేసుకున్నారు. దర్శకుడు ఈవీవీ.. విజయలక్ష్మి పేరును ‘రంభ’గా మార్చారు. ఆమె దేశ వ్యాప్తంగా రంభగానే సూపర్ పాపులర్ అయ్యారు. మరి, రంభ రీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.