iDreamPost
android-app
ios-app

తనకున్న ఆరోగ్య సమస్య గురించి చెప్పిన పాయల్‌ రాజ్‌పుత్‌!

కాగా, మంగళవారం సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి-పాయల్‌ రాజ్‌పుత్‌ల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో మొదటగా ఆర్‌ఎక్స్‌ 100 సినిమా వచ్చింది.

కాగా, మంగళవారం సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి-పాయల్‌ రాజ్‌పుత్‌ల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో మొదటగా ఆర్‌ఎక్స్‌ 100 సినిమా వచ్చింది.

తనకున్న ఆరోగ్య సమస్య గురించి చెప్పిన పాయల్‌ రాజ్‌పుత్‌!

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో కుర్రకారు హృదయాలను దోచుకున్నారు పంజాబీ భామ ‘పాయల్‌ రాజ్‌పుత్‌’. ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయటంతో తెలుగులో వరుస ఆఫర్లు వచ్చాయి. కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, కన్నడ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేశారు. ఆమె నటించిన తాజా చిత్రం ‘ మంగళవారం’ త్వరలో విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ఈవెంట్‌ జరిగింది. ఈ ఈవెంట్‌లో పాయల్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ..

తనకున్న అనారోగ్య సమస్య గురించి చెప్పుకొచ్చారు. చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి తనకు కథ చెప్పటానికి వచ్చే సమయానికి తాను కిడ్నీ సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఉన్నానని తెలిపారు. డాక్టర్లు కచ్చితంగా సర్జరీ చేయాలన్నారని పేర్కొన్నారు. సినిమా కథ నచ్చటంతో సినిమా షూటింగ్‌ పూర్తయ్యే వరకు సర్జరీ చేయించుకోకూడదని డిసైడ్‌ అయినట్లు వెల్లడించారు. మంగళవారం సినిమాను వరంగా భావిస్తున్నట్లు ఆమె అన్నారు.

కాగా, మంగళవారం సినిమా దర్శకుడు అజయ్‌ భూపతి-పాయల్‌ రాజ్‌పుత్‌ల కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా. వీరిద్దరి కాంబినేషన్‌లో మొదటగా ఆర్‌ఎక్స్‌ 100 సినిమా వచ్చింది. ఇప్పుడు రెండో సారి వీరిద్దరూ కలిసి ‘ మంగళవారం’ సినిమా తీశారు. ఆర్‌ఎక్స్‌ 100 సినిమాకు ముందు పాయల్‌ పంజాబీ, హిందీ సినిమాల్లో నటించేది. ఆమె చెన్నా మెరెయా అనే పంజాబీ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. వీరేకీ వెడ్డింగ్‌ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆర్‌ఎక్స్‌ 100 ఆమె మూడవ సినిమా. మరి, పాయల్‌ రాజ్‌పుత్‌ వరంగా భావిస్తున్న ‘‘ మంగళవారం’’ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş