iDreamPost
android-app
ios-app

కోరుకున్న ప్రియుడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్

  • Published Mar 12, 2024 | 9:53 PM Updated Updated Mar 12, 2024 | 9:53 PM

Meera Chopra Married her Lover: మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ సింగ్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.

Meera Chopra Married her Lover: మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ సింగ్ లైఫ్ కి గుడ్ బై చెప్పి వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.

  • Published Mar 12, 2024 | 9:53 PMUpdated Mar 12, 2024 | 9:53 PM
కోరుకున్న ప్రియుడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్

సినీ ఇండస్ట్రీకి చెందిన తారలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడం సర్వసాధారణం. మూవీస్ లో నటిస్తూనే తమ సహ నటుల ప్రేమలో పడి కొంతకాలం సహజీవనం చేసి పెళ్లి చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు.   గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతూనే ఉంది. ఈ మధ్యనే స్టార్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో రకూల్ ప్రీత్ సింగ్ పెళ్లైంది. బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో అందరినీ ఆకర్షంచిన కంటెస్టెంట్ దివ్య అగర్వాల్ తాను ప్రేమించిన ప్రియుడిని పెళ్లాడి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఇలా బుల్లితెర, వెండితెరకు చెందిన పలువురు సెలబ్రెటీలు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ చేరింది. వివరాల్లోకి వెళితే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ మూవీ హీరోయిన్ మీరా చోప్రా తన 40 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కింది. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ముంబైకి చెందని ప్రముఖ వ్యాపార వేత్త రక్షిత్ తో మూడేళ్లుగా సహజీవనం చేసి పెద్దల అంగీకారంతో ఈ జంట మూడు మూళ్ల బంధం ఒక్కటయ్యారు. బంగారం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న మీరా చోప్రా ఎంఎస్ రాజు దర్శకత్వంలో వచ్చిన వాన మూవీతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తర్వాత గ్రీకు వీరుడు సినిమాలు నటించిన తర్వాత టాలీవుడ్ కి దూరమైంది. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించింది. ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ లో దాదాపు 30 చిత్రాల్లో నటించింది.

బాలీవుడ్ అందాల భామలు ప్రియాంక చోప్రా, మన్నార చోప్రా, పరిణితి చోప్రా, మీరా చోప్రా బంధువులు. గత ఏడాది క్రిస్ మస్ సందర్భంగా తన ప్రియుడు రక్షిత్ ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరిచయం చేసింది. మీరా చోప్రా చివరిగా 2019 లో సెక్షన్ 375 మూవీలో నటించింది. సఫేద్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడి వయసు 40 ఏళ్లే.. చాలా లేటు వయసులో పెళ్లి చేసుకోవడం బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు, అభిమానులు మీరా చోప్రా జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం కొత్త జంట పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Meera Chopra (@meerachopra)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş