iDreamPost
android-app
ios-app

చాలా పెద్ద తప్పు చేశా.. హీరోయిన్ అనిత భావోద్వేగం! వీడియో వైరల్

  • Published Aug 31, 2024 | 5:53 PM Updated Updated Aug 31, 2024 | 6:08 PM

Anita Hassanandani: నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ హీరోయిన్ ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని తాను జీవితంలో క్షమించలేని తప్పు చేశానంటూ నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

Anita Hassanandani: నువ్వు నేను మూవీ హీరోయిన్ అనిత గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ హీరోయిన్ ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొని తాను జీవితంలో క్షమించలేని తప్పు చేశానంటూ నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

  • Published Aug 31, 2024 | 5:53 PMUpdated Aug 31, 2024 | 6:08 PM
చాలా పెద్ద తప్పు చేశా.. హీరోయిన్ అనిత భావోద్వేగం! వీడియో వైరల్

హీరోయిన్ ‘అనిత’.. ఈ పేరుతో ప్రేక్షకులు గుర్తుపట్టాడం కష్టమే కానీ, ఉదయ్ కిరణ్ ‘నువ్వు నేను’ మూవీ హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఎందుకంటే.. అనిత ఈ సినిమాతోనే టాలివుడ్ కు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే తెలుగనాట మంచి గుర్తింపు, విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, ముసలోడికి దసరా పండుగ, శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను,నేను పెళ్లికి రెడీ వంటి సినిమాల్లో నటించింది.

కానీ, ఆ తర్వాత తెలుగు అవకాశాలు తగ్గడంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు మకం మార్చింది. ఇక అక్కడ పలు సినిమాలు చేస్తూ అనిత బిజీగా మారిపోయింది. ఇక కెరీర్ మంచి ఫీక్స్ లో ఉన్నప్పుడు ఈ అమ్మడు రోహిత్ రెడ్డి అనే వ్యక్తిని 2013లో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఒక కూమారుడు ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అనిత తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొంది. ఇక అక్కడ ఈ బ్యూటీ తాను జీవితంలో పెద్ద తప్ప చేశానని, తన తండ్రిని క్షమించమంటూ కన్నీరు పెట్టుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..

బాలీవుడ్ బ్యూటీ అనిత తాజాగా  ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నది. ఇక అక్కడ  తన కెరీర్‌ ఎలా మొదలైంది, అలాగే చిన్నతనంలో తన తండ్రి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న అనే విషయాలు గురించి చెప్పుకొచ్చారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మద్యానికి బానిసైన నా తండ్రిని చూసి నేను ఎన్నో సందర్భాల్లో ఆగ్రహానికి లోనయ్యానని, ఆయనతో సరిగ్గా మాట్లాడలేకపోయానంటూ భావోద్వేగానికి గురైంది. ఇక అలా ఎన్ని ఏళ్లు గడిచపోయాయో కూడా తెలీదు. కానీ, ఇప్పుడు చెప్తున్నా సారీ నాన్న.. నేను నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నాకు నా కొడుకు (ఆరవ్) పుడితే కానీ నీ ప్రేమ అర్ధం కాలేదు. నిజానికి నువ్వు ఆరవ్ ను కలవాల్సింది, తనతో ఆడుకోవాల్సింది. నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నువ్వు తాగుబోతువని, మద్యానికి బానిసయ్యవని, దాని నుంచి నువ్వు బయటపడటం లేదని చాలా కోపడ్డాను. అసలు నీపై అంతా కోపం చూపించాల్సింది కాదు. నన్ను క్షమించండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

అలాగే అనిత తండ్రి తన 15 ఏళ్ల వయసునప్పుడే వదిలేసి పోయారట. అప్పుడు తనది చిన్న వయసు కావడంతో ఏం చేయాలో తెలిసేది కాదట. ఇక తన కూడా అమ్మ ఒంటరిదైపోయింది. పైగా అప్పటికే  అనిత అక్కకు పెళ్లయిపోయింది. ఉన్నది తన ఒక్కదాయి. కనుక ఆ వయసులోనే నటుడు మనోజ్‌ కుమార్‌ తనయుడు కునాల్‌ గోస్వామి ఆఫీసులో అనిత రిసెప్షనిస్టుగా చేరారట. ఇక అప్పుడు కునాల్‌ సోదరుడు నన్ను చూసి ఫోటోషూట్‌ ట్రై చేయొచ్చుగా అన్నాడు. ఈ క్రమంలోనే అనిత ఫోటోషూట్స్‌ చేస్తూ ఆడిషన్స్‌ కు వెళ్లేవారట. అలా తాను మొదటిగా వెండితెరపైకి 1999లోని బాలీవుడ్ లో తెరకెక్కిన తాల్ మూవీలో ఓ పాటతో  ఎంట్రీ ఇచ్చారు.

ఇక అలా మొదలు పెట్టిన  తన సినీ ప్రయాణం ఈ సినిమా తర్వాత..  తెలుగులో ఆఫర్ వచ్చేయి. ఈ నేపథ్యంలోనే తెలుగులో అనిత హీరోయిన్ గా  2001లో నువ్వు-నేను సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పాటు అనిత హిందీలో నాగినీ అనే సీరియల్ లో కూడా నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఆ సీరియల్ తెలుగులో కూడా ప్రసారమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అనిత తన తండ్రి గురించి ఎమోషనల్ గా చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet