Dharani
Vijay Antony: విజయ్ ఆంటోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీవితాంతం చెప్పులు ధరించను అన్నారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనక గల కారణాలు ఏంటి అంటే..
Vijay Antony: విజయ్ ఆంటోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీవితాంతం చెప్పులు ధరించను అన్నారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనక గల కారణాలు ఏంటి అంటే..
Dharani
సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఎంత సుకుమారంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమా షూటింగ్‌లో ఎలాంటి కష్టమైన సీన్లు.. స్టంట్లు అయినా చేస్తారు కానీ.. నార్మల్‌గా ఉన్నప్పుడు మాత్రం.. పర్సనల్ కేర్ చాలా తీసుకుంటారు. చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరుగుతారు. ఇక బయటకు వెళ్లే వేళ.. అకేషన్‌ను బట్టి చెప్పులు, షూస్ ఇలా రకరకాల పాదరక్షలు ధరిస్తారు. సెలబ్రిటీలు అనే కాదు.. సామాన్యులు కూడా చెప్పులు లేకుండా అడుగు బయటపెట్టరు. ఇక వేసవిలో చెప్పులు లేకుండా నడవడం అంటే.. నిప్పుల మీద నిలబడటం అనే చెప్పవచ్చు. అయినా సరే.. తాను మాత్రం ఇక జీవితాంతం చెప్పులు ధరించనంటూ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు ఓ హీరో. ఎందుకు అంటే..
తాను జీవితాంతం చెప్పులు ధరించను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.. కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిచ్చగాడు సినిమా ద్వారా టాలీవుడ్‌కి పరిచయం అయ్యి.. మంచి హిట్టు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆయన తమిళ్‌లో చేసిన ప్రతి సినిమా.. తెలుగులో కూడా విడుదలవుతుంది. ఈ క్రమంలో తాజాగా విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా, డి.లలితా, బి.ప్రదీప్, పంకజ్ బోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక తాజాగా చిత్ర బృందం.. ఈ సినిమా టీజర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విజయ్ అంటోని పలు విషయాలను పంచుకున్నాడు. అంతేకాక ఈ కార్యక్రమానికి విజయ్ ఆంటోని చెప్పులు లేకుండా వచ్చాడు. దాంతో ఏదైనా దీక్షలో ఉన్నారా అని మీడియా వారు ప్రశ్నించారు. అందుకు ఆయన బదులిస్తూ.. షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘‘నేను ఎలాంటి దీక్షలో లేను. కాకపోతే గత మూడు నెలలుగా చెప్పులు లేకుండానే తిరుగుతున్నాను. ఇక జీవితాంతం చెప్పులు ధరించకూడదని నిర్ణయం తీసుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు
అంతేకాక విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. ‘‘ఒకరోజంతా నేను చెప్పులు లేకుండా తిరిగాను. అప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. చెప్పులు లేకుండా నడిస్తే.. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిదే. అంతేకాకుండా ఈ అలవాటు మనలో ఆత్మవిశ్వాసాన్నిపెంచుతుంది. ఎప్పుడైతే నేను చెప్పులు లేకుండా తిరగడం ప్రారంభించానో ఆ సమయం నుంచి నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను. ఈ అలవాటు వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు.
టాలీవుడ్‌లో జాతి రత్నాలు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనుదీప్ కూడా తాను పెద్దగా చెప్పులు ఉపయోగించనని గతంలో ఒక ఇంటర్వ్యూ వెల్లడించిన సంగతి తెలిసిందే. చెప్పులు లేకుండా నడవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అనేక నివేదికలు ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్ని సెలబ్రిటీలు పాటిస్తున్నారు.