iDreamPost
android-app
ios-app

దంగల్ లో అమీర్ ఖాన్ లా వరుణ్ తేజ్

  • Published Mar 12, 2024 | 5:02 PM Updated Updated Mar 12, 2024 | 5:02 PM

మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో అందరిని అలరించాడు. ఇక ఇప్పుడు ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ మట్కా . ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో అందరిని అలరించాడు. ఇక ఇప్పుడు ఈ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ మట్కా . ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Mar 12, 2024 | 5:02 PMUpdated Mar 12, 2024 | 5:02 PM
దంగల్ లో అమీర్ ఖాన్ లా వరుణ్ తేజ్

యంగ్ హీరోలు కొత్తగా ఏదైనా చేసి, ప్రేక్షకులను మెప్పించడానికి పడని కష్టం లేదు. ఎత్తుకోని ప్రయాస లేదు. కానీ వాళ్ళ ప్రయత్నంలో గానీ, సంకల్పంలో గానీ గొప్ప నిజాయితీ ఉంది. రెగ్యులర్ సినిమాలు చేయడానికి సుతరాము ఇష్టపడట్లేదు యంగ్ టాలెంట్. అందులో వరుణ్ తేజ్ అయతే మరీ స్పష్టంగా ఉన్నాడనే చెప్పాలి. లేకపోతే, మొదటి సినిమా ముకుంద తర్వాత వెంటనే కంచెలాంటి ప్రయోగాత్మక, డిఫరెంట్ టైపు ఫిల్మ్ ఎవ్వరూ ఎంచుకోరు. అదొక్క వరుణ్ తేజ్ మాత్రమే చేయగలడు. ఏదో ఒ రెండు మూడు హిట్స్ వచ్చాక కావాలంటే డిఫరెంట్ జోనర్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు.ఇప్పుడు తనని తాను కొత్తగా ఆవిష్కిరంచుకోవడానికి మరో ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. అదేంటంటే మట్కా సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ టైమ్ లైన్స్ లో డిఫరెంట్ ఏజెస్ లో కనిపిస్తాడు సినిమా మొత్తంలో. 1980 ప్రాంతాల్లో జరిగే కథని బేస్ గా తీసుకుని ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న మట్కా తాజాగా మూడో షెడ్యూల్ కి అడుగుపెడుతోంది.

ఇందులో 20, 30, 50 ఏళ్ళ వయసుల్లో కనిపించే వరుణ్ తేజ్, లేదా దర్శకుడు కరుణ కుమార్ చూపించే దాన్లో వరుణ్ తేజ్ కొత్తగా కనిపించడానికి కంకణం కట్టుకున్నాడు. అదే యాభై ఏళ్ళవాడిగా కనిపించాలి.అందుకు 20కి, 30కి, 50కి క్లియర్ డిఫరెన్స్ ని చూపించడానికి.. యాభై ఏళవాడిగా కనిపించడానికి వరుణ్ తేజ్ ఒళ్లు పెంచుకోవడానికి, ఫిఫ్టీస్ లో వ్యక్తిలా ప్రత్యక్షమవడానికి వరుణ్ పొట్ట పెంచుకునే పనిలో పడ్డాడు. ఎవరైనా తగ్గడానికో, సిక్స్ ప్యాక్ పెంచుకోవడానికో శ్రమ పడితే, వరుణ్ మాత్రం నిజాయితీగా యాభై ఏళ్ళ వాడి పొట్టలా పెంచుకోవడానికి దాదాపు నెలరోజుల పాటు తగిన చర్యలు తీసుకుంటున్నాడు. ఏదో ఒకటి చేయకపోతే ఆడియన్స్ దగ్గరకి తీసుకోరనే ఫార్ములాని వరుణ్ గట్టిగా నమ్ముతాడు. అందుకే కంచె చేసినా, రెమ్యూనరేషన్ తగ్గించుకుని మరీ అంతరిక్షం చేసినా, పుల్వమా ఎటాక్ నేపథ్యంలో ఆపరేషన్ వేలంటైన్ లాటి తెలుగులో ఫస్టాపిట్స్ కైండ్ సినిమా చేసినా.. ఈ ప్రయత్నాలన్నీ అందుకే.

దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ ఇద్దరు అడపిల్లల తండ్రిలా కనిపించడానికి, వయసు పైబడ్డవాడిగా నమ్మించడానికి అచ్చం అలాగే పెద్ద బొజ్జతో తయారయ్యాడు. అదేమీ గెటప్ మేకప్ కాదు. నిజంగానే పెంచుకున్నాడు. అదే అందర్నీ ఇంప్రెస్ చేసింది. దంగల్ సినిమా హిట్ కావడానికి అమీర్ ఖాన్ అలా కనిపించడమే పెద్ద ప్లస్ పాయంట్ అయింది. అదే ఫార్ములాని ఇప్పుడు మెగా ప్రిన్స్ అనుసరించబోతున్నాడు. అనుకరించబోతున్నాడు.వరుణ్ ప్రయత్నం పలించి, మట్కా సినిమా హిట్ కావడానికిది అడ్వాంటేజ్ కావచ్చేమో.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet