iDreamPost
android-app
ios-app

కమెడియన్ వివేక్ గుర్తుగా..హీరో వైభవ్ గొప్ప పని.. నెటిజన్స్ హ్యాట్సాఫ్!

Vaibhav Reddy: ఎంతో మంది సెలబ్రిటీలు వివిధ కారణాలతో మరణిస్తుంటారు. వారికి గుర్తుగా కుటుంబ సభ్యులు లేదా అభిమానులు గొప్ప కార్యక్రమాలు చేపడుతుంటారు. అలానే ఓ ప్రముఖ కమెడియన్ కి గుర్తుగా ఓ హీరో మొక్కలు నాటారు.

Vaibhav Reddy: ఎంతో మంది సెలబ్రిటీలు వివిధ కారణాలతో మరణిస్తుంటారు. వారికి గుర్తుగా కుటుంబ సభ్యులు లేదా అభిమానులు గొప్ప కార్యక్రమాలు చేపడుతుంటారు. అలానే ఓ ప్రముఖ కమెడియన్ కి గుర్తుగా ఓ హీరో మొక్కలు నాటారు.

కమెడియన్ వివేక్ గుర్తుగా..హీరో వైభవ్ గొప్ప పని.. నెటిజన్స్ హ్యాట్సాఫ్!

ఎవరు భూమి మీద శాశ్వతంగా ఉండరు. అయితే వారు చేసిన పనులు, వారి కీర్తి మాత్రమే ప్రజల్లో గుర్తుండి పోతుంది. ఎందరో సినీ, రాజకీయ రంగానికి చెందిన వారు తమదైన సేవలతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. ఇక చనిపోయిన ప్రముఖలకు గుర్తుగా స్మారక చిహ్నాలు, ఇతర గొప్ప కార్యక్రమాలను వారి బంధువులు లేదా అభిమానులు చేపడుతుంటారు. ఇక చనిపోయిన సెలబ్రిటీల జయంతి, వర్ధంతి సందర్భాల్లో తోటి నటీనటులు గొప్ప కార్యక్రమాలు చేపడుతుంటారు. తాజాగా ప్రముఖ హాస్యనటుడు వివేక్ గుర్తుగా ఓ హీరో గొప్ప పని చేశారు. మరి.. ఆ వివరాలు, ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కోలీవుడ్ ఇండస్ట్రీలో మర్చిపోలేని నటుల్లో వివేక్ ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించి..స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందారు. రజనీకాంత్, విక్రమ్, సూర్య, విజయ్ వంటి ఎంతో మంది స్టార్ హీరోలతో అనేక సినిమాల్లో నటించారు. ఇంకా చెప్పాలంటే ఒకానొక సమయంలో ఆయన లేని సినిమాలు అంటే ఏమిలేవు. హీరోల స్థాయిలో క్రేజ్ సంపాందించారు. అయితే మూడేళ్ల క్రితం గుండెపోటుతో వివేక్ మరణించారు. ఆయనకు కోలీవుడ్ తో పాటు తెలుగు చిత్రపరిశ్రమలో కూడా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఆయన మూడో వర్ధంతిని పురస్కరించుకుని నటుడు వైభవ్‌ షూటింగ్‌ స్పాట్‌లో మొక్కలను నాటారు.

ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి కుమారుడు వైభవ్. ఈ హీరో గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే అనేక విభిన్నమైన సినిమాల్లో నటించి..తెలుగు ప్రేక్షుకులను మెప్పించారు. ప్రస్తుతం వైభవ్ తన 27వ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో వైభవ్ తో పాటు సెల్ మురుగన్ కూడా నటిస్తున్నారు. వైవిధ్య భరిత కథాంశంతో ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ మూవీ షూటింగ్‌ స్థానిక తరమణిలోని ఎంజీఆర్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్ లో వివేక్ గుర్తుగా వైభవ్ మొక్కలు నాటారు.

దివంగత హాస్యనటుడు వివేక్..మాజీ రాష్ట్రపతి అబ్ధుల్ కలాం స్పూర్తితో గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించే ప్రయత్నం చేశారు. ఆయన జీవించి ఉన్న సమయంలో తమిళనాడులో వేలాది మొక్కలను నాటారు. ఇక ఆయనకు ఇష్టమైన ఈ మొక్కల నాటే కార్యక్రమాని ఆయన మూడో వర్థంతి సందర్భంగా వైభవ్ నాటాడు. వివేక్ ను గౌరవించేలా నటుడు వైభవ్‌తో పాటు ఇతర చిత్ర యూనిట్‌ సభ్యులు, ఎంజీఆర్‌ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థులు కలిసి 100 మొక్కలను నాటారు. ఈ విషయాన్ని యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మరి.. ఈ యంగ్ హీరో చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.