iDreamPost
android-app
ios-app

అదితీరావుతో ఎంగేజ్మెంట్ పై ఓపెన్ అయిన సిద్ధార్థ.. పెళ్లి ఎప్పుడంటే?

  • Published Apr 07, 2024 | 4:40 PM Updated Updated Apr 07, 2024 | 4:40 PM

Siddharth- Aditi Rao: హీరో సిద్ధార్థ్ అదితీరావుతో నిశ్చితార్థంపై నోరు విప్పాడు. ప్రేమ వార్తలను తోసిపుచ్చినట్లు కాకుండా.. ఈసారి సూటిగా సమాధానం చెప్పాడు. అలాగే పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

Siddharth- Aditi Rao: హీరో సిద్ధార్థ్ అదితీరావుతో నిశ్చితార్థంపై నోరు విప్పాడు. ప్రేమ వార్తలను తోసిపుచ్చినట్లు కాకుండా.. ఈసారి సూటిగా సమాధానం చెప్పాడు. అలాగే పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చేశాడు.

  • Published Apr 07, 2024 | 4:40 PMUpdated Apr 07, 2024 | 4:40 PM
అదితీరావుతో ఎంగేజ్మెంట్ పై ఓపెన్ అయిన సిద్ధార్థ.. పెళ్లి ఎప్పుడంటే?

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ కు సౌత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. పక్కింటి కుర్రాడిగా, లవర్ బాయ్ గా చాలానే మంచి సినిమాలు చేశాడు. ఇప్పుడు అటు తమిళ్ లో కూడా దూసుకుపోతున్నాడు. సిద్ధార్థ్ ఈ మధ్య సినిమాల కంటే కూడా.. వ్యక్తిగత జీవితానికి సంబంధించే ఎక్కువ వైరల్ అవతున్నాడు. ఎప్పటి నుంచో అదితీరావు హైదరీ- సిద్ధార్థ్ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఈ జంట ఖండించిన విషయం తెలిసిందే. కానీ, సడెన్ వీరికి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిగింది అంటూ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా సిద్ధార్థ్ ఈ సీక్రెట్ ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అదితీరావుతో నిశ్చితార్థంపై ఎట్టకేలకు సిద్ధార్థ్ స్పందించాడు. ఈసారి ప్రేమ విషయంలో దాట వేసినట్లు తప్పించుకోకుండా సూటిగా సమాధానం చెప్పాడు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధార్థ్ కు అదితీరావుతో ఎంగేజ్మెంట్ కి సంబంధించి అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి సిద్ధార్థ్ సమాధానం చెప్పుకొచ్చాడు. “మేమేదో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అనుకుంటున్నారు. నిజానికి సీక్రెట్- ప్రైవేటు పదాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మేము మా కుటంబాల సమక్షంలో కలిసి నిశ్చితార్థం చేసుకుంటే అది సీక్రెట్ ఎలా అవుతుంది? ఎవరికీ చెప్పకుండా హడావుడిగా చేసుకుంటే అది సీక్రెట్ అవుతుంది. అందరి సమక్షంలో అందరి ఇష్టంతో మేము నిశ్చితార్థం చేసుకున్నాం.

Siddarth

నేను మొదట అదితీ ఏమని సమాధానం చెబుతుందో అని ఎంతో భయపడ్డాను. కానీ, ఆమె నాతో జీవితాన్ని పంచుకోవాడనికి అంగీకరించింది. ఇంక పెళ్లి విషయానికి వస్తే.. అది నా చేతుల్లో లేదు. అది మా పెద్దవాళ్లు ఒక మంచి రోజు చూసి నిర్ణయిస్తారు. నేను డిసైడ్ చేయడానికి అది షూటింగ్ డేట్ కాదు కదా?” అంటూ సిద్ధార్థ్ ప్రశ్నించాడు. మొత్తానికి వారికి జరిగిన ఎంగేజ్మెంట్ గురించి మాత్రం ఈ లవర్ బాయ్ ఓపెన్ కామెంట్స్ చేశాడు. అలాగే ఆ రోజు జరిగింది పెళ్లి కాదని.. ఎంగేజ్మెంట్ అనే విషయాన్ని మాత్రం క్లియర్ గా చెప్పాడు.

అసలు ఏం జరిగిందంటే?:

మార్చి 17న సిద్ధార్థ్- అదితీరావు వనపర్తి జిల్లాలోని శ్రీరంగపురంలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మొదట ఆలయ పూజారులకు సినిమా షూటింగ్ అని చెప్పారంట. ఆ తర్వాత మొత్తం సెటప్ చూసిన తర్వాత అందరూ అదితీరావు- సిద్ధార్థ్ లకు పెళ్లై పోయింది అంటూ వార్తలు వచ్చాయి. అది కూడా పాన్ ఇండియా లెవల్లో వైరల్ అయ్యాయి. ఇంకేముంది ఈ స్టార్ హీరో ఆ వార్తలపై స్పందిస్తూ అది కేవలం నిశ్చితార్తం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు పెళ్లి విషయంపై కూడా ఉన్న మాటను బయటపెట్టేశాడు. బహుశా ఇంక పెళ్లిపై మరిన్ని రూమర్స్ రాకుండా ఉండేందుకు ఈ పని చేశాడు కావచ్చు. మరి.. అదితీరావు- సిద్ధార్థ్ ప్రేమ, నిశ్చితార్థంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Siddharth (@worldofsiddharth)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom