iDreamPost
android-app
ios-app

తండ్రైన హీరో శర్వానంద్.. కూతురు ఫొటోలు వైరల్!

  • Published Mar 06, 2024 | 8:32 PM Updated Updated Mar 06, 2024 | 8:46 PM

Sharwanand Blessed With Baby Girl: హీరో శర్వానంద్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు అమ్మాయి పుట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

Sharwanand Blessed With Baby Girl: హీరో శర్వానంద్ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తనకు అమ్మాయి పుట్టినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

  • Published Mar 06, 2024 | 8:32 PMUpdated Mar 06, 2024 | 8:46 PM
తండ్రైన హీరో శర్వానంద్.. కూతురు ఫొటోలు వైరల్!

హీరో శర్వానంద్ ఫ్యాన్స్ ప్రస్తుతం.. తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. శర్వానంద్ బర్త్ డేని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. పైగా శర్వానంద్ నుంచి రాబోతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఉదయం నుంచి అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. మొత్తం 3 ప్రాజెక్టులకు సంబంధించి ఇవాళ అప్ డేట్స్ ఇచ్చారు. ఇలాంటి తరుణంలో శర్వానంద్ కూడా ఫ్యాన్స్ కు ఒక శుభవార్త చెప్పాడు. తమ దంపతులు అమ్మానాన్నలు అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అంతేకాకుండా చిన్నారికో ఉన్న పిక్స్ ని పోస్ట్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు.

యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుం చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ యంగ్ హీరో లాస్ట్ ఇయర్ జూన్ 3న రక్షితారెడ్డిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ పుట్టిన రోజు సందర్భంగా శర్వానంద్ ఉదయం నుంచి సినిమా అప్ డేట్స్ తో అలరించాడు. సాయంత్రానికి మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అదిరిపోయే న్యూస్ షేర్ చేశాడు. ఈ గుడ్ న్యూస్ ని ఇప్పటివరకు దాచాను అంటూ తన కుమార్తెను పరిచయం చేశాడు. రక్షితారెడ్డి-శర్వానంద్ దంపతులు బిడ్డతో కలిసి ఉన్న ఫొటోని షేర్ చేశారు. అయితే పాప ముఖాన్ని చూపించలేదు. కానీ, పేరును మాత్రం వెల్లడించాడు.

 

View this post on Instagram

 

A post shared by Sharwanand (@imsharwanand)

పాపకు లీలాదేవి అనే పేరు పెట్టినట్లు శర్వానంద్ దంపతులు తెలియజేశారు. అయితే గతేడాది రక్షితారెడ్డి గర్భం దాల్చింది అంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఎక్కడా కూడా శర్వానంద్ ఆ వార్తలను కన్ఫమ్ చేయలేదు. అంతేకాకుండా అసలు తన భార్య గర్భవతి అనే విషయాన్ని కూడా ఎక్కడా వెల్లడించలేదు. కానీ, ఇలా తన పుట్టినరోజు సందర్భంగా నేరుగా కూతురినే పరిచయం చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు. ప్రస్తుతం శర్వానంద్ తండ్రైన విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అలాగే టాలీవుడ్ హీరోలు, సెలబ్రిటీలు అందరూ శర్వానంద్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sharwanand (@imsharwanand)

ఇంక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ఈరోజు మొత్తం 3 సినిమాలను అనౌన్స్ చేశాడు. శర్వానంద్- శ్రీరామ్ ఆదిత్య ప్రాజెక్టుకు మనమే అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శర్వాకు జంటగా కృతిశెట్టి నటించనుంది. అలాగే శర్వానంద్ 36 నుంచి అప్ డేట్ వచ్చింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ 36వ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బైక్ రైడర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఇంక శర్వానంద్ 37వ చిత్రం నుంచి కూడా అప్ డేట్ వచ్చింది. సామజవరగమణ ఫేమ్ రమ్ అబ్బరాజుతో శర్వానంద్ ఈ చిత్రాన్ని చేయబోతున్నాడు. మరి.. కామెంట్స్ రూపంలో శర్వానంద్ దంపతులకు మీ శుభాకాంక్షలు తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sharwanand (@imsharwanand)

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet