Keerthi
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీ చేయగా.. నిబంధనలు లేని ఆహార పదార్థాలను వినినియోగిస్తున్నరని ఆ హోటల్ కు సంబంధించిన పలు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వాటిపై స్పందించిన సందీప్ కిషన్ తమ హోటల్ పై వస్తున్న తప్పుడు దుష్ప్రచారలపై ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ నోట్ రాసుకొచ్చారు.
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో ఫుడ్ సెఫ్టీ అధికారులు తనిఖీ చేయగా.. నిబంధనలు లేని ఆహార పదార్థాలను వినినియోగిస్తున్నరని ఆ హోటల్ కు సంబంధించిన పలు ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వాటిపై స్పందించిన సందీప్ కిషన్ తమ హోటల్ పై వస్తున్న తప్పుడు దుష్ప్రచారలపై ఖండిస్తూ సోషల్ మీడియా ద్వారా ఓ నోట్ రాసుకొచ్చారు.
Keerthi
ఈ మధ్య కాలంలో వరుసగా నగరంలోని ఫుట్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే..నగరంలో స్టార్ హోటల్స్ నుంచి రెస్టారెంట్స్ వరకు జరుగుతున్న మోసాలు ఒకొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఏమాత్రం శుభ్రత, నాణ్యతలేని ఫుడ్ ని విక్రయిస్తూ అమాయకపు ప్రజలను మోసం చేస్తున్నారు. అంతేకాకుండా.. కుళ్లిపోయిన, బూజి పట్టిన ఆహారపదార్థలను వండి పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలు రెస్టారెంట్స్ పై అధికారులు కఠిన చర్యలు తీసుకొని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్ పై కూడా నిన్న ఫుడ్ సెఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.
కాగా, సందీప్ కిషన్ కు సంబంధించిన వివాహ భోజనంబు రెస్టారెంట్ లో తనిఖీలు చేయగా.. అక్కడ పాడైనా పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అలాగే వండిన పదార్థాలను ప్రిజ్ లో నిల్వ చేసి.. అవే కస్టమర్లకు అందిస్తున్నరని తేలింది. దీనితో పాటు చిట్టి ముత్యాల బియ్యం, అవుటేడెట్ ఫుడ్ పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అయితే తాజాగా తన హోటల్ పై తప్పుడు దుష్ప్రచారలపై చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలని సోషల్ మీడియా ద్వారా ఓ నోట్ రాసుకొచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ వివాహ భోజనంబు రెస్టారెంట్ లో నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అయింది. అలాగే గడువు ముగిసిన చిట్టిముత్యాలు రైస్ బ్యాగ్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన సందీప్ కిషన్ తమ హోటల్ పైవస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ లేఖ విడుదల చేసి హెడ్‌లైన్స్ పెట్టేముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఇక ఆ లేఖలో.. ‘గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు రెస్టారెంట్ పేరుతో మేము కస్టమర్లకు చాలా నమ్మకమైన సేవలు అందిస్తున్నాం. కానీ, మా హోటల్‌పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలు. ముఖ్యంగా కొన్ని ఫోటోలు తమ హోటల్ కిచెన్‌కు సంబంధించినవి కావు. పైగా మా హోటల్ ఫోటోస్ కు బదులు వేరే ఫోటోలు పెట్టి తమ కిచెన్ ఫోటోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
అలాగే హోటల్‌లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్ ఉన్నమాట నిజమే. కానీ, ఇప్పటివరకు ఆ రైస్ ప్యాకెట్ కు సీల్ కూడా తీయలేదని, అవి కేవలం వెండర్ శాంపిల్ కోసం ఇచ్చిన రైస్ బ్యాగ్ మాత్రమేనని సందీప్ కిషన్ తెలిపారు. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో వస్తున్న కిచెన్ ఫోటోలు తమ రెస్టారెంట్‌కు సంబంధించినవి కాదనిచిన్నచిన్న పొరపాట్లను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలని అధికారులు సూచించినట్లు వివరించారు. ఇక ఎప్పటిలాగే ఫుడ్ సేఫ్టీ, టేస్ట్ విషయంలో క్వాలిటీ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని’ సందీప్ కిషన్ పేర్కొన్నారు. మరి, హీరో సందీప్ కిషన్ తమ రెస్టారెంట్స్ పై వస్తున్న అవాస్తవాలపై రియాక్ట్ అవుతూ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేఖపై మీ అభిప్రాయాలను సోషల్ మీడియాలో తెలియజేయండి.
Request my Dear Patrons to pls check facts before buying into the
“Exaggerated Instant HeadLines Culture”We as Team #VivahaBhojanambu have built a Loyal clientele over 8 years with our Food & Sincerity,we would never take your love for granted ♥️
*below facts can be verified pic.twitter.com/yiWt4UaDzL
— Sundeep Kishan (@sundeepkishan) July 10, 2024