నాంపల్లి కోర్టుకు నాగార్జున.. సురేఖని వదలొద్దంటూ జడ్జికి రిక్వెస్ట్!

Akkineni Nagarjuna: మహిళా మంత్రి కొండా సురేఖ నాగ్ ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న నాగ్ సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

Akkineni Nagarjuna: మహిళా మంత్రి కొండా సురేఖ నాగ్ ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న నాగ్ సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించింది. నాగచైతన్య, సమంత విడాకులపై కొండా సురేఖ తీవ్రమైన కామెంట్స్ చేసింది. ఈమె చేసిన వ్యాఖ్యలపై నాగ్ కుటుంబం మండిపడింది. ప్రజా జీవితంలో ఉండి ఉన్నతమైన పదవి చేపట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో టాలీవుడ్ నటీనటులు కూడా నాగార్జున కుటుంబానికి అండగా నిలిచారు. సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగ్ లీగల్ యాక్షన్ కు సిద్ధమై నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆమెపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

పిటీషన్ స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా నాగ్ ను కోర్టుకు నేరుగా హాజరు కావాలని ఆదేశించింది. తన వర్షన్ ఏంటో కోర్టుకు చెప్పాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో హీరో నాగార్జున నేడు అనగా మంగళ వారం నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో నాగార్జున స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. సురేఖ తన కుటుంబంపై చేసిన ఆరోపణలపై స్టేట్ మెంట్ ఇవ్వనున్నారు నాగ్. నాగ్ తో పాటు సాక్షుల స్టేట్ మెంట్ ను కోర్టు రికార్డు చేయనున్నది. పిటీషన్ పై మధ్యాహ్నం 2 గంటల సమయంలో విచారణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో కొండా సురేఖను వదలొద్దని నాగ్ జడ్జికి రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

తన కుటుంబ పరువుకు బంగం కలిగించిన సురేఖను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని తెలిపినట్లు సమాచారం. ఏ మచ్చ లేని తన కుటుంబంపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు బాధించాయని అందుకు ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని జడ్జిని కోరినట్లు తెలుస్తోంది. కేసు విచారణ నేపథ్యంలో కోర్టు వద్ద ఉత్కంఠ వాతావరణం కొనసాగుతున్నది. మరో వైపు బీసీ మంత్రిపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటూ సురేఖ వర్గం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో నాగార్జునపై కేసు వేయనున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా నాగచైతన్య సమంత విడాకులపై దేని ఆధారంగా కామెంట్స్ చేశారు? ఫ్రూవ్స్ ఏంటి అని కోర్టు ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి సురేఖ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం కాబోతున్నది. దీంతో సర్వాత్రా ఉత్కంఠ నెలకొన్నది.

Show comments