iDreamPost
android-app
ios-app

ఇంట్రెస్టింగ్ గా ధనుష్ D50 ఫస్ట్ లుక్.. ఇంకో హీరోని గమనించారా?

  • Published Feb 19, 2024 | 6:47 PM Updated Updated Feb 20, 2024 | 12:47 PM

Dhanush D50 First Look: హీరో ధనుష్ 50వ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా టైటిల్ ని కూడా రివీల్ చేశారు.

Dhanush D50 First Look: హీరో ధనుష్ 50వ చిత్రానికి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఫస్ట్ లుక్ మాత్రమే కాకుండా టైటిల్ ని కూడా రివీల్ చేశారు.

  • Published Feb 19, 2024 | 6:47 PMUpdated Feb 20, 2024 | 12:47 PM
ఇంట్రెస్టింగ్ గా ధనుష్ D50 ఫస్ట్ లుక్.. ఇంకో హీరోని గమనించారా?

హీరో ధనుష్ కేవలం సౌత్ లోనే కాకండా పాన్ ఇండియా లెవల్లో మంచి క్రేజ్ ఉంది. హాలీవుడ్ లో కూడా నటించి ఇండియన్ యాక్టర్స్ సత్తాని చూపెట్టాడు. ఇప్పుడు ధనుష్ ఒక మైల్ స్టోన్ కి దగ్గరవుతున్నాడు. తన కెరీర్ లో 50వ చిత్రంపై క్రేజీ అప్ డేట్ ని అందించాడు. ఈ మూవీపై ఫ్యాన్స్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ధనుష్ ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. టైటిల్ కూడా చాలా కొత్తగా, క్యాచీగా ఉంది. పైగా ఈ మూవీ ఎంత వైలెంట్ గా ఉండబోతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పోస్టర్ చూడగానే అందరికీ అర్థమైపోతోంది. పైగా ఈ పోస్టర్ లో ఇంకో సర్ ప్రైజ్ కూడా ఉంది.

సాధారణంగానే ధనుష్ చిత్రాలు అంటే హైప్ ఓ రేంజ్ లో ఉంటుంది. తెలుగులో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది. అలాంటిది ధనుష్ కెరీర్లో 50వ చిత్రం అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాటిని ఏమాత్రం తగ్గించకుండా ధనుష్ తన తర్వాతి చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఈ మూవీకి ర్యాన్ అనే పేరు పెట్టారు. ఈ మూవీని కరుణానిధి మారన్ సమర్పణలో తెరకెక్కిస్తుండగా.. ధనుష్ స్వీయ రచన, దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. హీరో ధనుష్ లిరిక్ రైటర్, ప్రొడ్యూసర్ అని అందరికీ తెలిసిందే.

2017లో పా పాండి అనే చిత్రంతో డైరెక్టర్ గా కూడా అరంగేట్రం చేశాడు. అలాగే ఆ చిత్రానికి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ ర్యాన్ చిత్రంతో మరోసారి తన డైరెక్షన్ స్కిల్స్ ని ఫ్యాన్స్ కి చూపించబోతున్నాడు. ఈ ఫస్ట్ లుక్ మాత్రం ఎంతో ఆసక్తిగా.. కాస్త వైలెంట్ గా ఉంది. కెప్టెన్ మిల్లర్ లో బారు జుట్టు, గడ్డంతో కనిపించిన ధనుష్ ఈ మూవీలో మాత్రం గుండుతో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో మాత్రం గుండుతో చేతిలో పదునైన ఆయుధంతో కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తే ధనుష్ ప్రొఫెషనల్ బుచెర్ లా కనిపిస్తున్నాడు. ఈ ఫస్ట్ లుక్ లో ఇంకో సర్ ప్రైజ్ కూడా ఉంది.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈ మూవీలో నటిస్తున్నాడు. కెప్టెన్ మిల్లర్ లో కూడా సందీప్ కిషన్ ఒక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అది క్యామియో తరహాలో చాలా తక్కువ డ్యురేషన్ తో ఉంది. అలా కాకుండా ఈ మూవీలో మంచి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ దొరుకుతుందని భావిస్తున్నారు. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ కొరియోగ్రాఫర్ గా పీటర్ హెయిన్ చేస్తున్నాడు. ఈ మూవీ గతేడాదే సెట్స్ మీదకు వెళ్లింది. ఇప్పుడు శరవేగంగా పనులు పూర్తి చేసుకుని 2024లోనే థియేటర్లలో విడుదల చేస్తాం అంటూ ప్రకటించారు. మొత్తానికి తన 50వ చిత్రానికి సంబంధించి ధనుష్ క్రేజీ అప్ డేట్ ఇవ్వడమే కాకుండా.. మూవీపై భారీ అంచనాలను పెంచేశాడు. మరి.. ధనుష్ 50వ చిత్రం ఫస్ట్ లుక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Dhanush (@dhanushkraja)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş