iDreamPost
android-app
ios-app

ఆ హీరోతో పెళ్ళికి సిద్దమైన అర్జున్ కూతురు ఐశ్వర్య!

  • Published Oct 25, 2023 | 6:03 PM Updated Updated Oct 25, 2023 | 6:03 PM

ఐశ్వర్య ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందం, అభినయం ఉన్నా ఐశ్వర్యకు గుర్తింపు రాలేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న ఐశ్వర్య మరోవైపు ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది.

ఐశ్వర్య ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందం, అభినయం ఉన్నా ఐశ్వర్యకు గుర్తింపు రాలేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న ఐశ్వర్య మరోవైపు ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది.

  • Published Oct 25, 2023 | 6:03 PMUpdated Oct 25, 2023 | 6:03 PM
ఆ హీరోతో పెళ్ళికి సిద్దమైన అర్జున్ కూతురు ఐశ్వర్య!

సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో అర్జున్. మా పల్లెలో గాపాలుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అర్జున్ డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ యాక్షన్ కింగ్ గా మారిపోయారు. కాగా అర్జున్ కు కుమారుడు లేకపోవడంతో తన కూతురు ఐశ్వర్య తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. ఏ ఇండస్ట్రీలో అయినా ఎక్కువగా హీరోల కుమారులు మాత్రమే సినిమా రంగంలోకి వస్తుంటారు. హీరోల కుమార్తెలు సినిమాల్లో హీరోయిన్లుగా నటించడం చాలా అరుదనే చెప్పాలి. ఈ క్రమంలోనే అర్జున్ కుమార్తె సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఐశ్వర్య ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అందం, అభినయం ఉన్నా ఐశ్వర్యకు గుర్తింపు రాలేదు. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న ఐశ్వర్య మరోవైపు ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశర్య ప్రేమలో మునిగితేలుతున్నట్లు వార్తలొస్తున్నాయి. చాలా కాలంగా వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. అయితే వీరి ప్రేమ విషయం ఇరువైపు కుటుంబాలకు తెలియడంతో వివాహానికి అంగీకారం తెలిపినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కాగా ఉమాపతి కూడా సినమా నేపథ్యమున్న కుటుబానికి చెందిన వ్యక్తే. ఈయన పలు తమిళ్‌ చిత్రాల్లో హీరోగా నటించాడు. త్వరలోనే ఐశ్వర్య, ఉమాపతిల ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలుస్తోంది. అయితే అర్జున్ తన కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. స్వయంగా తనే నిర్మాతగా మారి ఐశ్వర్య హీరోయిన్ గా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. మరి ఈ సినిమా ద్వారా ఐశ్వర్యకు మంచి గుర్తింపు వచ్చి సినిమాల్లో నిలదొక్కుకుంటుందో లేదో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom