iDreamPost
android-app
ios-app

ఆ కమెడియన్‌ కొడుకుతో.. హీరో అర్జున్‌ కుమార్తె వివాహం!

  • Published Jun 27, 2023 | 11:46 AM Updated Updated Jun 27, 2023 | 11:46 AM
  • Published Jun 27, 2023 | 11:46 AMUpdated Jun 27, 2023 | 11:46 AM
ఆ కమెడియన్‌ కొడుకుతో.. హీరో అర్జున్‌ కుమార్తె వివాహం!

హీరో అర్జున్‌ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె ఐశ్వర్జ సర్జా.. వివాహం ఫిక్స్‌ అయ్యింది. ప్రముఖ తమిళ కమెడియన్‌ తంబి రామయ్య కొడుకు, యంగ్‌ హీరో ఉమాపతి రామయ్యతో ఐశ్యర్య వివాహం జరగనుంది. అయితే వీరిది ప్రేమ వివాహం. ఐశ్వర్య, ఉమాపతి.. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం.. వారు వీరి ప్రేమను అంగీకరించడం వెంటవెంటనే జరిగిపోయాయి. కుమారుడి ప్రేమ వివాహానికి తాను అంగీకారం తెలిపినట్లు.. తంబి రామయ్య వెల్లడించాడు. ఇరు కుటుంబాలు ఇటీవల ఇదే అంశంపై మాట్లాడుకున్నామని.. త్వరలోనే డేట్ ఫిక్స్ చేయనున్నట్లు తెలిపారు. ఇరు కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా పరిచయాలు ఉన్నాయని.. ఈ క్రమంలోనే ఐశ్వర్య అంటే తనకు ఇష్టమని ఉమాపతి తమకు చెప్పాడని తెలిపారు.

నవంబర్ 8న ఉమాపతి బర్త్ డే సందర్భంగా పెళ్లి డేట్‌ను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఉమాపతి-ఐశ్వర్య సర్జాల పెళ్లి ఉంటుందని తెలిపారు. అయితే యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో శ్రీ ఆంజనేయం, శ్రీ మంజునాథ, హనుమాన్ జంక్షన్, రామరామ కృష్ణ కృష్ణ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల విశ్వక్ సేన్‌తో అర్జున్ ఓ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాతో తన కూతురిని తెలుగులో హీరోయిన్‌గా లాంచ్ చేద్దామని అర్జున్ భావించారు. అయితే పలు కారణాతో ఆ సినిమా అర్ధంతరంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అంతేకాక అర్జున్‌, విశ్వక్‌ సేన్‌ల మధ్య విబేధాలు రాజేసింది కూడా.

ఇక కమెడిన్‌ తంబి రామయ్య తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచం లేదు. కానీ తమిళ్‌లో మాత్రం ఆయనకు విపరీతమైన ‍క్రేజ్‌ ఉంది. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌-సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తోన్న బ్రో ఒరిజినల్‌ వెర్షన్‌ వినోదయ సీతాం సినిమాల్లో తంబీ రామయ్య ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. సినిమాలో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. ఇక తంబీ రామయ్య కుమారుడు ఉమాపతి హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.2017లో హీరోగా పరిచయం అయిన ఉమాపతి.. ఇప్పటికి నాలుగు సినిమాల్లో నటించాడు. అలా ఓ సినిమా షూటింగ్‌లో ఐశ్యర్యతో ఉమాపతికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఇక త్వరలోనే వీరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap