iDreamPost
android-app
ios-app

OTTని షేక్‌ చేస్తున్న వెబ్‌ సిరీస్‌.. వెంటనే చూసేయండి!

  • Published May 05, 2024 | 12:55 PM Updated Updated May 05, 2024 | 12:55 PM

Heeramandi, Netflix, Sanjay Leela Bhansali: ప్రతి రోజు ఓటీటీల్లో ఏం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చాయి అని వెతికే ఓటీటీ లవర్స్‌కు ఇది బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌. చూడకుంటే.. ఇప్పుడే చూసేయండి.

Heeramandi, Netflix, Sanjay Leela Bhansali: ప్రతి రోజు ఓటీటీల్లో ఏం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చాయి అని వెతికే ఓటీటీ లవర్స్‌కు ఇది బెస్ట్‌ వెబ్‌ సిరీస్‌. చూడకుంటే.. ఇప్పుడే చూసేయండి.

  • Published May 05, 2024 | 12:55 PMUpdated May 05, 2024 | 12:55 PM
OTTని షేక్‌ చేస్తున్న వెబ్‌ సిరీస్‌.. వెంటనే చూసేయండి!

ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తుండటంతో.. చాలా మంది థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. వీకెండ్స్‌లో ఓటీటీల్లో సినిమా చూస్తూ.. సాయంత్రం క్రికెట్‌ మజాను ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే క్రికెట్‌ కంటే సినిమాలకే క్రేజ్‌ ఎక్కువ అనుకోండి. ఓటీటీల్లో కొత్త కొత్త కంటెంట్‌ కోసం వెతికే వారికి.. అదిరిపోయే వెబ్‌ సిరీస్‌ సజెషన్‌ను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. ఓటీటీ లవర్స్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను ఎగబడి చూస్తున్నారు. ఇంతకీ ఆ వెబ్‌ సిరీస్‌ పేరు ఎంటంటే.. హీరామండి. అంటే వజ్రాల బజార్‌ అని అర్థం. ఈ వెబ్‌ సిరీస్‌ను తీసింది ఎవరో కాదు.. భారతీయ సినిమా గర్వపడే డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ. హిందీతో రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌.. తెలుగు, తమిళ్‌, కన్నడ, మలయాళంతో పాటు 14 భాషల్లో అందుబాటులో ఉంది.

ఈ సినియా కోసం డైరెక్టర్‌ సంజయ్‌ లీలా భన్సాలీ ఏకంగా 70 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు సమాచారం. అత్యంత అద్భుతంగా సాగిన కథనంతో, స్వాతంత్రోద్యమానికి పూర్వం హీరామండిలోని వేశ్యల జీవితాన్ని, వారి జీవితంతో ముడిపడిన స్వతంత్ర పోరాటాన్ని ఈ వెబ్‌ సిరీస్‌లో గొప్పగా చూపించారు. పైగా ఇందులో భారీ తారాగణం ఉండటం ప్లస్‌ పాయింట్‌. మే 1 నుంచి ఈ వెబ్‌ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలో బ్రిటిష్ పరిపాలన కాలంలో.. హీరామండీ అనే రెడ్ లైట్ ప్రాంతంలో.. జీవనం సాగించే కొంతమంది డ్యాన్సర్స్ జీవితాల గురించి ఈ సిరీస్ లో చూపించారు.

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ఈ వెబ్ సిరీస్‌లో నటించారు. వీరిలో హైయ్యస్ట్ రెమ్యునరేషన్ సోనాక్షీ సిన్హాకి ఇచ్చినట్లు సమాచారం. ఫరీదాన్ పాత్రలో సోనాక్షిసిన్హాకు ఏకంగా రెండుకోట్ల రూపాయల పారితోషికం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక మల్లికాజాన్ పాత్రలో నటించిన మనీషా కొయిరాలకు కోటి, అదితిరావు హైదరికి కోటిన్నర రూపాయల పారితోషికం ఇచ్చినట్టుగా సమాచారం. లజ్జోగా నటించిన రిచా చంద్డాకు కోటి రూపాయలు , వహీదాగా నటించిన సంజీదా షేక్‌కు నలభై లక్షలు, ఆలంజేబ్‌గా నటించిన షర్మిన్ సెగల్ కు 35లక్షలు పారితోషికంగా ఇచ్చినట్టు తెలుస్తోంది.