Heavy Rains: AP, తెలంగాణలో భారీ వరదలు.. రూ.కోటి సాయం ప్రకటించిన Jr NTR

Heavy Rains-Jr NTR Donation To TG, AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్.. ఏపీ, తెలంగాణకు భారీ సాయం ప్రకటించారు. ఆ వివరాలు..

Heavy Rains-Jr NTR Donation To TG, AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్.. ఏపీ, తెలంగాణకు భారీ సాయం ప్రకటించారు. ఆ వివరాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ ఎత్తున వరదలు ఏర్పడి.. జన జీవనం స్థంభించిపోయింది. రోడ్ల మీద 5, 6 అడుగుల మేర వరద నీరు ప్రవహించి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వరదల వల్ల రెండు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కూడా సంభవించింది. భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. పరిస్థితిని సమీక్షించారు. వరద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. దీనిపై స్పందించిన సెలబ్రిటీలు.. తమకు తోచిన మేర సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఏపీ, తెలంగాణకు జూనియర్ ఎన్టీఆర్ భారీ ఎత్తున సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆ వివరాలు..

భారీ వర్షాలతో అల్లాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు జూనియర్ ఎన్టీఆర్ భారీ విరాళం అందించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ’’ఏపీ, తెలంగాణలో ఇటీవల కురుస్తన్న భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలచి వేసింది. తెలుగు ప్రజలు ఈ విపత్తు నుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వంతుగా చెరొక రూ.50 లక్షల చొప్పున కోటి విరాళం అందజేస్తున్నాను‘‘ అని జూనియర్ చెప్పుకొచ్చారు.

అలానే తెలుగు రాష్ట్రాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా అండగా నిలిచారు. ఏపీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్‌ చేసి వివరించారు. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక తన వంతు సాయంగా.. ఆయన వ్యక్తిగత పింఛన్‌ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షల చొప్పున విరాళం అందించారు. అలానే వెంకయ్య కుమారుడు హర్షవర్దన్‌ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్‌ తరఫున రెండు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున, కుమార్తె దీపా వెంకట్‌ నిర్వహిస్తున్న స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ నుంచి కూడా తెలుగు రాష్ట్రాలకు రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించారు. జూనియర్ చేసిన సాయంపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments