Krishna Kowshik
చైల్డ్ ఆర్టిస్టుగా అలరించి... హాలీవుడ్ హీరోయిన్ అయిన బ్యూటీ అవంతిక వందనపు. స్పిన్, మ్యాక్సీ, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్, బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె నటనకు ఫిదా అయ్యింది...
చైల్డ్ ఆర్టిస్టుగా అలరించి... హాలీవుడ్ హీరోయిన్ అయిన బ్యూటీ అవంతిక వందనపు. స్పిన్, మ్యాక్సీ, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్, బిగ్ గర్ల్స్ డోంట్ క్రై వంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె నటనకు ఫిదా అయ్యింది...
Krishna Kowshik
‘అమ్మ చేసింది మిస్.. లైట్‌గానే ఉంటుంది’ అంటూ ఫార్చూన్ సన్ ఫ్లవర్ యాడ్ లో ముద్దుముద్దుగా కనిపిస్తూ.. క్లాసికల్ డ్యాన్సుతో అదరగొట్టిన పాప అవంతిక వందనపు గుర్తుంది కదా. ఈ యాడ్‌తో తెలుగు దర్శకుల కళ్లలో పడి..చైల్డ్ ఆర్టిస్టుగా మారిపోయింది. మహేష్ బ్రహ్మోత్సవం, రారండోయ్ వేడుక చూద్దాం, ప్రేమమ్, మనమంతా, బాలకృష్ణుడు, ఆక్సిజన్, అజ్ఞాతవాసి, బాబు బాగా బిజీ వంటి చిత్రాల్లో అలరించింది. ఆమెరికాలోని కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన పదాహరణాల అచ్చ తెలుగు అమ్మాయి. ఆమె మల్లీటాలెంటర్. క్లాసికల్ డ్యాన్సర్, సింగర్, మోడల్, యాక్టర్, ఆర్టిస్టు కూడా.10 ఏళ్ల వయసులో నటనపై ఆసక్తితో హైదరాబాద్ వచ్చింది. ఇండియాలో ఆరేళ్ల పాటు ఉండి వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని తిరిగి అమెరికా వెళ్లిపోయింది.
అక్కడి వెళ్లాక చదువుకుంటూనే హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా వరుస అవకాశాలతో దూసుకెళుతుంది. 2021లో డిస్నీ ఛానెల్ రూపొందించిన స్పిన్, మ్యాక్సీ, సీనియర్ ఇయర్, మీన్ గర్ల్స్ వంటి చిత్రాల్లో నటించింది. కాగా, అయితే ఆమె ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చింది. మీన్ గర్ల్స్ కొనసాగింపుగా వచ్చిన ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై’ వెబ్ సిరీస్‌లో అలరించింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా ఆమె అమెరికన్ యాన్సియెంట్‌పై కొంత మంది పని గట్టుకుని విమర్శలు, ట్రోల్స్ చేశారు. నిజం తెలుసుకోకుండా తెలుగు అమ్మాయి అమెరికా వెళితే ఇలాగే మారిపోతారంటూ కామెంట్స్ చేశారు. కానీ తన నటనతో ఆ మాటలకు చెక్ పెట్టడమే కాదు.. తెలుగు అమ్మాయి హాలీవుడ్‌లో సత్తా చాటుతుందని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్లింది.
మీన్ గర్ల్స్ చిత్రంలో అవంతిక నటనకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్శిటీ హార్వర్డ్ విశ్వవిద్యాలయం సైతం మెస్మరైజ్ అయ్యింది. ఆమెకు సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. దీని పట్ల ఆమె మాట్లాడుతూ.. ‘నా ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్టాత్మక సంస్థ గౌరవించడం నిజంగా నమ్మశక్యంగా లేదు. కానీ స్ఫూర్తినిచ్చింది. ఈ అవార్డు నా ప్రయత్నాన్ని గుర్తించడమే కాదు. ప్రపంచంలో భారత ప్రాధాన్య త తెలియజేస్తుంది. మూస పద్దతులను సవాలు చేసే విధంగా, వైవిధ్యాన్ని స్వీకరించి, లోతైన కథలను ఎంపిక చేసుకునేందుకు ఈ అవార్డు ప్రోత్సాహాన్ని ఇచ్చింది. నేనను భవిష్యత్ మరిన్ని మంచి పాత్రలు చేసి..గ్లోబల్ ఫ్లాట్ ఫారమ్ లో భారతీయ స్వరాన్ని వినిపించేందుకు ప్రయత్నిస్తాను’ అంటూ పేర్కొంది. వాస్తవంగా చెప్పాలంటే.. ఈ అవార్డు.. మన హీరోయిన్స్‌కి సాధించడం కష్టమే. కానీ ఆమె హాలీవుడ్ చిత్రాలతో మెప్పించింది కాబట్టి.. ఆ అవార్డును కొల్లగొట్టి.. మరోసారి భారత్‌కు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.