iDreamPost
android-app
ios-app

ఓటీటీలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సాంగ్ రిలీజ్! హరీష్ శంకర్‌తో మామూలుగా ఉండదు

  • Published Aug 07, 2024 | 9:25 PM Updated Updated Aug 08, 2024 | 5:21 PM

Mr. Bachchan New Song Released By Harish Shankar: ఒకప్పుడు ఆడియో లాంఛ్ ఈవెంట్లు పెట్టి సాంగ్ లు రిలీజ్ చేసేవారు. ఆ ట్రెండ్ పోయి సోషల్ మీడియాలో రిలీజ్ చేసే ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా పోయి డైరెక్ట్ ఓటీటీలో సింగర్స్ ద్వారా రిలీజ్ చేసే ట్రెండ్ వచ్చేలా ఉంది. హరీష్ శంకర్ అదే పని చేశారు.

Mr. Bachchan New Song Released By Harish Shankar: ఒకప్పుడు ఆడియో లాంఛ్ ఈవెంట్లు పెట్టి సాంగ్ లు రిలీజ్ చేసేవారు. ఆ ట్రెండ్ పోయి సోషల్ మీడియాలో రిలీజ్ చేసే ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఈ ట్రెండ్ కూడా పోయి డైరెక్ట్ ఓటీటీలో సింగర్స్ ద్వారా రిలీజ్ చేసే ట్రెండ్ వచ్చేలా ఉంది. హరీష్ శంకర్ అదే పని చేశారు.

  • Published Aug 07, 2024 | 9:25 PMUpdated Aug 08, 2024 | 5:21 PM
ఓటీటీలో ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సాంగ్ రిలీజ్! హరీష్ శంకర్‌తో మామూలుగా ఉండదు

సినిమాలో మాటలు, ఫైట్లు, కామెడీ, ఎమోషన్ సీన్స్ ఎలాగో పాటలు కూడా అంతే. ఈ పాటలు తెలుగు సినీ ప్రేక్షకుల జీవితాల్లో ఒక భాగం అయిపోయాయి. ఈ మధ్య కొన్ని సినిమాల్లో పాటలు రావడం లేదు గానీ చాలా సినిమాలు అయితే పాటలు లేకపోతే వెలితిగా ఉంటుంది. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ లాంటి పెద్ద హీరోల సినిమా అంటే మినిమమ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. హై వోల్టేజ్ మాస్ సాంగ్స్ లో కాస్త క్లాస్ టచ్ ఇస్తూ లిరిక్స్ పెడితే మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా మెంటలెక్కిపోతారు. అలాంటి పాటలను ఒకప్పుడు ఆడియో లాంఛ్ ఈవెంట్లు నిర్వహించి గ్రాండ్ గా రిలీజ్ చేసేవారు. ఆ తర్వాత ట్రెండ్ మారడంతో నేరుగా సోషల్ మీడియాలో విడుదల చేయడం స్టార్ట్ చేశారు.

బ్బర్ సింగ్ సినిమాలో ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా అన్నట్టు.. హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ సాంగ్ ని సోషల్ మీడియాలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు. ఆహా ఓటీటీలో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షోలో రిలీజ్ చేశారు. ఎక్స్ క్లూజివ్ గా ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద సింగర్ శ్రీరామచంద్రతో పాట పల్లవిని పాడించారు. ఈ సాంగ్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయలేదని, ఆహా ఇండియన్ ఐడల్ కోసం మిస్టర్ బచ్చన్ నుంచి ఎక్స్ క్లూజివ్ పల్లవి అని అన్నారు. ఈ మూవీలో ఇదే ఆఖరి పాట అని అన్నారు. శ్రీరామచంద్ర ఈ పాట పల్లవి పాడి వినిపించారు. మిస్టర్ బచ్చన్ మూవీ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో కలిసి శ్రీరామచంద్ర ఈ పాటను ఆలపించారు.

Mr. Bachchan who set the trend!

‘సువ్వాలా సువ్వి సూదంటి సూపే’ అంటూ సాగే ఈ పాట వినడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఆ తర్వాత ఒక్కసారిగా మాస్ బీట్ తో, మాస్ లిరిక్స్ తో పాట పూనకాలు తెప్పించేస్తుంది. ఈ సాంగ్ థియేటర్ లో ఓ రేంజ్ లో ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇవ్వడం పక్కా. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కూడా అంచనాలు పెంచేశాయి. ఈ మూవీలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ అధికారిగా కనిపిస్తుండడం విశేషం. హరీష్ శంకర్ మార్క్ డైలాగ్స్ ఇందులో ఓ రేంజ్ లో ఉన్నాయి. ఒక పక్క ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన హరీష్ శంకర్.. మరో పక్క సాంగ్ ని ఓటీటీలో రిలీజ్ చేసి ట్రెండ్ సెట్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by ahavideoin (@ahavideoin)

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş