P Krishna
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు తెలుగు ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతి పండుగ వాతావరణం కనిపిస్తుంది. దీనికి తోడు తెలుగు ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తున్నాయి.
P Krishna
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు సంక్రాంతి పండుగ.. సినిమా పండగని తలపిస్తుంది. ఇప్పటికే గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా.. సైంధవ్, నా సామిరంగ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. శుక్రవారం గుంటూరు కారం, హనుమాన్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. ప్రతి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలతో చిన్న హీరోల సినిమాలు కూడా పోటీ పడుతుంటాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఎలాంటి సినిమాకైనా బ్రహ్మరథం పడతారన్న విషయం తెలిసిందే. అది చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ప్రేక్షకులు ఇచ్చే తీర్పును బట్టే ఉంటుంది. ఇదిలా ఉంటే.. హనుమాన్ మూవీ చూసిన ప్రేక్షకులు ఆదిపురుష్ డైరెక్టర్ పై సెటైర్లు వేస్తున్నారు.
కల్కి, జాంబీరెడ్డి లాంటి విభిన్న తరహా సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ‘హనుమాన్’ పాన్ ఇండియా మూవీగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అనుకున్నట్లుగానే ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. సాధారణంగా హిందువులు రామాయణం, మహాభారతం కాన్సెప్ట్ తో వచ్చే సినిమాలు ఎంతో భక్తి పారవశ్యంతో తిలకిస్తుంటారు. హనుమాన్ మూవీ విషయానికి వస్తే.. ఒక సాధారణ యువకుడికి హనుమంతుడి శక్తులు వస్తే సూపర్ హీరోగా ఎలా మారుతాడు.. విలన్ల నుంచి తనను తాను ఎలా రక్షించుకుంటాడు.. కష్టాల్లో ఉన్న తన వారిని ఎలా కాపాడుతాడు అన్న పాయింట్ ని దర్శకుడు చాలా బాగా చూపించాడు. దీనికి తోడు విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఎంతో అద్బుతంగా ఉన్నాయి. కొన్ని సీన్లు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. మొత్తానికి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన హనుమాన్ సక్సెస్ తో మరోసారి తెలుగోడి సత్తా ఏంటో తెలిసొచ్చింది.
అయితే ఇదే ఇప్పుడు ఓం రౌత్ పాలిట శాపం అయ్యింది. సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓం రౌత్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. దీనికి కారణం ఏంటో మీకు కూడా తెలుసు. ఆయన ప్రభాస్ తో ఓ కళాఖండాన్ని తీశాడు. ఆ కళాఖండం పేరే ఆదిపురుష్. ఈ సినిమాకి ఓం రౌత్ ఏకంగా 500 కోట్ల పైనే పెట్టుబడి పెట్టించినట్లు టాక్ ఉంది. అయితే నాశిరకం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ వాడేసి ఏదో నామమాత్రంగా హడావుడిగా సినిమా రిలీజ్ చేశాడని ఆదిపురుష్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది. సినిమా మేకింగ్ అప్పటి నుంచి కూడా ఓం రౌత్ పై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. గ్రాఫిక్స్ నాశిరకంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. 500 కోట్ల బడ్జెట్ మూవీలా లేదని ఓం రౌత్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నారు. అక్కడితో ఆ డిస్కషన్ అయిపోయిందనుకుంటే.. ఇప్పుడు హనుమాన్ రూపంలో మళ్ళీ తెరపైకి వచ్చింది.
హనుమాన్ మూవీకి ప్రొడక్షన్ రూపేణా అయిన ఖర్చు 12 కోట్లు అని.. ప్రింట్, అడ్వర్టైజ్మెంట్ కలిపి ఫైనల్ గా 30 కోట్లు అయ్యాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఆకట్టుకున్నాడు. సూపర్ హీరో కథతో హనుమాన్ ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించింది. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా ఒక ట్రెండ్ సృష్టిస్తుందని అంటున్నారు. 30 కోట్ల తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ ఇంత చూపిస్తే.. ఆదిపురుష్ కోసం 500 కోట్లు పెట్టించిన ఓం రౌత్ ఎంత చూపించాలి అని నెటిజన్స్ ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు. క్వాలిటీగా సినిమా ఎలా తీయాలో ప్రశాంత్ వర్మని చూసి నేర్చుకో ఓం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓం రౌత్ పై మీమ్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. మరి హనుమాన్ సక్సెస్ తో ఓం రౌత్ పై ట్రోల్స్ వస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.