Keerthi
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసే సిని ప్రియులకు ఇప్పుడు ఈ సినిమా పై అధికార ప్రకటన వచ్చేసింది. ఇంతకి ఎప్పుడెంటే..
యంగ్ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురు చూసే సిని ప్రియులకు ఇప్పుడు ఈ సినిమా పై అధికార ప్రకటన వచ్చేసింది. ఇంతకి ఎప్పుడెంటే..
Keerthi
దేశ వ్యాప్తంగా ఇటీవల కాలంలో సెన్సేషన్ అయిన సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. అలాంటి వాటిలో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన సినిమాలో ‘హనుమాన్’ ఒకటి. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించగా.. తేజ సజ్జా ఇందులో హీరోగా నటించన విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతు ఆద్భుతం సృష్టించింది. ఇండస్ట్రీలో స్టార్ హీరో సినిమాలకు పోటీగా బరిలోకి దిగి అందరి అంచనాలను మించేలా చేసింది. ఇక హనుమాన్ మూవీ థియేటర్స్ లో సూపర్ డూపర్ హిట్ గా నిలవడంతో.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తాదా అని ఓటీటీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా మొదట మార్చి 2న ఓటీటీలో ప్రసారం కానుందని వార్త జోరుగా వినిపించింది. కానీ, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ పై అధికార ప్రకటన వచ్చేసింది. అది ఎప్పుడంటే..
ఇక థియేటర్లలో ఓ రేంజ్‌లో సందడి చేసిన ‘హనుమాన్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఎన్నో రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా డేట్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా హనుమాన్ మూవీ ఓటీటీ పై అధికార ప్రకటన వచ్చేసింది. కాగా, ఈ సినిమాను ఓటీటీ హక్కులకు జీ5 సంస్థ 35 కోట్లకు కొనుగోలు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే సంక్రాతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ హనుమాన్ మూవీ ఈనెల అనగా మార్చి 8న శుక్రవారం నాడు ఓటీటీ ప్రసారంకు అందుబాటులో రానుంది. మరి ఎప్పటి నుంచే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూసే ప్రేక్షకులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. మరి థియేటర్లలో కలెక్షన్స్ రాబెట్టిన ఈ సినిమా ఓటీటీలో కూడా దుమ్ము రేపుతుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు.
కాగా, హనుమాన్ మూవీ ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ థియేటర్ రెవిన్యూ వసూలు చేసింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అమృతా అయ్యర్ నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించింది.ఈ సినిమాను నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. అలాగే హరి గౌర,అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. మరి, మార్చి 8 నుంచి హనుమాన్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#HANUMAN pic.twitter.com/wzCEqXmubj
— Aakashavaani (@TheAakashavaani) March 1, 2024