iDreamPost
android-app
ios-app

Hanuman: హనుమాన్‌ ట్విట్టర్‌ రివ్యూ.. చివరి 20 నిమిషాలు అదిరింది!

హనుమాన్‌ సినిమా స్పెషల్‌ షోలు ఈ సాయంత్ర పడనున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు ఏరియాల్లో హనుమాన్‌ సినిమా సందడి చేయనుంది. అయితే, సినిమా సర్కిల్‌లోని కొంతమందికి షోలు పడ్డాయి.

హనుమాన్‌ సినిమా స్పెషల్‌ షోలు ఈ సాయంత్ర పడనున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు ఏరియాల్లో హనుమాన్‌ సినిమా సందడి చేయనుంది. అయితే, సినిమా సర్కిల్‌లోని కొంతమందికి షోలు పడ్డాయి.

Hanuman: హనుమాన్‌ ట్విట్టర్‌ రివ్యూ.. చివరి 20 నిమిషాలు అదిరింది!

దేశం మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న ‘హనుమాన్‌’ సినిమా టాక్‌ రానే వచ్చింది. గురువారం మధ్యాహ్నం సినిమా సర్కిల్‌లోని కొంతమందికి చిత్ర బృందం ప్రత్యేక షోలు వేసింది. హనుమాన్‌.. సెలెబ్రిటీ షో చూసిన వారిలో ప్రముఖ చిత్ర విమర్శకుడు తరణ్‌ ఆదర్స్‌ కూడా ఉన్నారు. మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత తనదైన శైలిలో ఆయన రివ్యూ ఇచ్చారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ సినిమా అద్భుతంగా ఉంది. మూడున్నర రేటింగ్‌ ఇస్తున్నాను.

ప్రశాంత్‌ వర్మ అద్భుతమైన సినిమా తీశారు. సినిమాలో ఎమోషన్‌, డ్రామా బాగున్నాయి. మైథాలజీతో కూడిన వీఎఫ్‌ఎక్స్‌ చూస్తుంటే గూస్‌బమ్స్‌ రావటం ఖాయం. తేజ సజ్జా నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, సముద్ర ఖని, వెన్నెల కిషోర్‌ అద్బుతంగా నటించారు. వీఎఫ్‌ఎక్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవే కీలక పాత్ర పోషించాయి. అన్ని పాత్రలకు డబ్బింగ్‌ బాగా కుదిరింది’’ అని పేర్కొన్నారు. ఆయన హిందీ వర్సన్‌కు సంబంధించి ఈ రివ్యూ ఇచ్చారు.

డబ్బింగ్‌ మారినా సినిమా మొత్తం ఒకటే కాబట్టి.. తెలుగులో కూడా బొమ్మ బ్లాక్‌ బ్లాస్టర్‌ అవ్వటం ఖాయం అనిపిస్తుంది. కాగా, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ రోజు సాయంత్రం నుంచి స్పెషల్‌ షోలు పడనున్నాయి. సాయంత్రం నుంచే తెలుగు టాక్‌ బయటకు రానుంది. ఇక, ప్రీబుకిం‍గ్స్‌ విషయంలో హనుమాన్‌ రికార్డులు సృష్టిస్తోంది.

తెలుగులో సినిమా చూసిన వాళ్లు ఇస్తున్న ఫస్టాఫ్ రివ్యూ ప్రకారం చూస్తే.. మూవీని ఒక పవర్ ఫుల్ పాత్రతో ప్రారంభిస్తారు. సూపర్ హీరోలపై తనకున్న పిచ్చితో ఎంత దూరమైనా వెళ్లేలా చూపిస్తారు. హీరో ఉండే గ్రామాన్ని చూపించే విధానం మాత్రం కాస్త డల్ గా కనిపిస్తుంది. కానీ, దైవభక్తితో ఇచ్చిన టచ్ మాత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. కథలో డివోషనల్ టచ్ ఇచ్చే విషయంలో మాత్రం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నైపుణ్యం మెప్పిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్, దానికి ఇచ్చే హైప్ మాత్రం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. ఫస్టాఫ్ వరకు విలేజ్ సీన్స్, లవ్ స్టోరీ కాస్త ప్రేక్షకులను పరీక్షించొచ్చు. ఫస్టాఫ్ లో మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్, సౌండ్ మిక్సింగ్, సీజీఐ వర్క్ మాత్రం సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ గా నిలిచింది. కానీ, సెకండాఫ్ సినిమా ఓవరాల్ అభిప్రాయాన్ని మార్చేసే అవకాశం లేకపోలేదు.