iDreamPost
android-app
ios-app

Hanuman Movie: థియేటర్ లో హనుమాన్ సూపర్ హిట్.. OTTలో మాత్రం నెగిటివిటి!

  • Published Mar 18, 2024 | 3:09 PM Updated Updated Mar 18, 2024 | 3:09 PM

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వస్తోంది. అదేంటి అక్కడ హిట్.. ఇక్కడ ఇలాంటి టాక్.. అని సినీ పండితులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏంటో తెలుసుకుందాం.

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హనుమాన్ మూవీ తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడ ఊహించని విధంగా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వస్తోంది. అదేంటి అక్కడ హిట్.. ఇక్కడ ఇలాంటి టాక్.. అని సినీ పండితులు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విచిత్ర పరిస్థితికి కారణం ఏంటో తెలుసుకుందాం.

Hanuman Movie: థియేటర్ లో హనుమాన్ సూపర్ హిట్.. OTTలో మాత్రం నెగిటివిటి!

పుర్రెకో బుద్ది.. జిహ్వకో రుచి అంటారు పెద్దలు. ఒకరికి నచ్చింది ఇంకొకరి నచ్చాలని లేదు. ఇది ఎక్కువగా సినిమాల విషయంలో రుజువు అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే? ఓటీటీల వాడకం పెరిగిపోయిన దగ్గరి నుంచి పుర్రెకో బుద్ది కాదు.. రెండు మూడు రకాలుగా మనుషులు మారిపోతున్నారు. థియేటర్లలో హిట్ అయిన సినిమాను ఓటీటీలో ప్లాప్ చేస్తున్నారు.. ప్లాన్ అయిన మూవీని హిట్ చేస్తున్నారు. ఇదెక్కడి చోద్యం అంటూ క్రీడా పండితులకు ప్రేక్షకుల మైండ్ సెట్ అర్థం కాక తలలు పట్టుకుంటూ ఉన్నారు. తాజాగా హనుమాన్ విషయంలో కూడా ఇదే జరిగింది. థియేటర్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రం, ఓటీటీకి వచ్చే సరికి నెగిటివిటిని ఎదుర్కొంటోంది. దానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన తొలి సూపర్ హీరో ఫిల్మ్. తేజా సజ్జ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగి యూనానిమస్ గా హిట్ కొట్టింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 330 కోట్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. హనుమాన్ ఎంత పెద్ద హిట్టో. చాలా తక్కువ బడ్జెట్ లో ఇంత క్వాలిటి గ్రాఫిక్స్ ను ప్రేక్షకులకు అందించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మను దర్శక ధీరుడు రాజమౌళితో పోల్చారు కొందరు ప్రముఖులు. ఇక థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులతో పాటుగా చూసిన వారు కూడా హనుమాన్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూడసాగారు.

Negativity on hanuman movie in OTT

అయితే అలాంటి వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది హనుమాన్ మూవీ. దీంతో ఆకలితో ఉన్న పులి వేటకు దూకినట్లు అంతా చూడటానికి ఎగబడటంతో.. రికార్డు వ్యూస్ వస్తున్నాయి. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ, టాక్ మాత్రం పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పిన ప్రేక్షకులు.. ఓటీటీలో చూసిన తర్వాత పూర్తిగా నెగటీవ్ గా చెబుతున్నారు. చాలా మంది తమకు హనుమాన్ నచ్చలేదని, జస్ట్ ఓకే అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. అయితే దీనికి కారణాలు లేకపోలేదు.

సాధారణంగా విజువల్ వండర్ మూవీస్ థియేటర్లలోనే చూస్తేనే మజా. అలాంటి సినిమా హనుమాన్, మరి ఇలాంటి చిత్రాన్ని ఓటీటీలో చూస్తే ఏం కిక్కొస్తుంది చెప్పండి. పైగా థియేటర్లలో చూసిన అందరూ బాగుంది.. బాగుంది అని చెప్పడంతో కూడా ఓటీటీలోకి రాబోయే ముందు భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దీంతో స్ట్రీమింగ్ అయ్యాక ఆ హైప్ ను అందుకోవడంలో విఫలమైంది హనుమాన్. అందుకే ఓటీటీలోకి వచ్చాక నెగిటివ్ టాక్ వచ్చింది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Thankamani: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మలయాళ రివెంజ్ డ్రామా