iDreamPost
android-app
ios-app

Sankranti Movies: సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఏది బెస్ట్?

  • Published Jan 15, 2024 | 2:18 PM Updated Updated Jan 15, 2024 | 2:35 PM

సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', సీనియర్ హీరోలు అయిన నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరితో పాటుగా యంగ్ హీరో తేజ సజ్జ 'హనుమాన్'తో థియేటర్లలో సందడి చేశాడు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ మూవీ బెస్ట్? ఓసారి పరిశీలిద్దాం పదండి.

సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', సీనియర్ హీరోలు అయిన నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరితో పాటుగా యంగ్ హీరో తేజ సజ్జ 'హనుమాన్'తో థియేటర్లలో సందడి చేశాడు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ మూవీ బెస్ట్? ఓసారి పరిశీలిద్దాం పదండి.

Sankranti Movies: సంక్రాంతికి రిలీజ్ అయిన 4 సినిమాల్లో ఏది బెస్ట్?

సంక్రాంతి.. టాలీవుడ్ కు పెద్ద పండగ. దీంతో స్టార్ హీరోలందరూ ఈ పండక్కి తమ తమ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఉత్సాహంతో ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా సంక్రాంతి పండక్కి బాక్సాఫీస్ పై దండయాత్ర చేశారు స్టార్ హీరోలు. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, సీనియర్ హీరోలు అయిన నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీరితో పాటుగా యంగ్ హీరో తేజ సజ్జ ‘హనుమాన్’తో థియేటర్లలో సందడి చేశాడు. మరి ఈ నాలుగు సినిమాల్లో ఏ మూవీ బెస్ట్? ఓసారి పరిశీలిద్దాం పదండి.

1. హనుమాన్

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, యంగ్ హీరో తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన మూవీ హనుమాన్. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ప్రశాంత్ వర్మ టేకింగ్, తేజ సజ్జ యాక్టింగ్ అంతకు మించి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలతో పోలిస్తే.. హనుమాన్ యునానిమస్ గా విజయం సాధించింది. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 66 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

2. గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇన్ని అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. గురూజీ మార్క్ మిస్సైందని, దాంతో సినిమా అనుకున్న రేంజ్ లో విజయాన్ని సాధించలేకపోయిందని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయినప్పటికీ.. వసూళ్లలో మాత్రం సూపర్ స్టార్ ఎక్కడా తగ్గడం లేదు. వరల్డ్ వైడ్ గా రెండు రోజుల్లోనే రూ.127 కోట్లు వసూళ్లు సాధించిన మహేష్.. మూడో రోజు కూడా అదేజోరును చూపించాడు. దీంతో మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 164 కోట్లు వసూలు చేశాడు సూపర్ స్టార్. కాగా.. గుంటూరు కారం మూవీకి రోజు రోజుకు టాక్ మారుతోంది. తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఇప్పుడు పాజిటీవ్ టాక్ గా మారింది. ఇందులో మహేష్ వన్ మ్యాన్ షోతో మాస్ అవతారంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు.

3. నా సామిరంగ

పక్కా పండగ సినిమాతో సంక్రాంతికి వస్తుంటాడు సీనియర్ హీరో అక్కినేని నాగార్జున. ఎప్పటిలాగే ఈ ఏడాది సంక్రాంతికి కూడా ‘నా సామిరంగ’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నాగ్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. నాగ్ తో పాటుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించగా.. రోటీన్ కథ అవ్వడంలో ప్రేక్షకులను అనుకున్నంతగా అలరించలేకపోయిందని సినీ పండితులు చెప్పుకొస్తున్నారు. అయితే అల్లరి నరేష్ పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే సినిమా కథ, మేకింగ్ విషయంలో తేడా కొట్టడంతో.. సంక్రాంతి బరిలో కాస్త వెనకబడ్డాడు నాగ్.

4. సైంధవ్

విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకీ మామ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. గతంలో ఎన్నడూ చూడని యాక్షన్ క్యారెక్టర్ లో జీవించేశాడు వెంకీ. అయితే సైంధవ్ మూవీలో పరిధి దాటిన ఎమోషనల్ సీన్స్ సినిమాకు మైనస్ గా మారాయి. సైంధవ్ ను భారీ యాక్షన్ సీన్స్ తో నింపే అవకాశం ఉన్నా.. డైరెక్టర్ శైలేష్ కొలను ఎమోషనల్ కు పెద్దపీట వేశాడు. దీంతో సినిమా సంక్రాంతి రేస్ లో కాస్త తగ్గింది. మరి సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ నాలుగు సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.