iDreamPost
android-app
ios-app

Prasanth Varma: ఆదిపురుష్ లో ఆ సీన్స్ నేనైతే ఇంకా బాగా తీసేవాడిని: ప్రశాంత్ వర్మ

  • Published Jan 27, 2024 | 9:05 PM Updated Updated Jan 27, 2024 | 9:05 PM

హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఆదిపురుష్ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఆదిపురుష్ మూవీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

  • Published Jan 27, 2024 | 9:05 PMUpdated Jan 27, 2024 | 9:05 PM
Prasanth Varma: ఆదిపురుష్ లో ఆ సీన్స్ నేనైతే ఇంకా బాగా తీసేవాడిని: ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఈ యంగ్ డైరెక్టర్ పేరు పాన్ ఇండియా లెవల్లో మారు మోగుతోంది. తన విజన్, తన టేకింగ్ కి సినిమా లవర్స్ ఫిదా అయిపోతున్నారు. మన సూపర్ హీరో హనుమాన్ ని ఇండియన్ ఆడియన్స్ కి సరికొత్తగా పరిచయం చేశాడు. తన యూనివర్స్ లో ఇంకా 11 మంది సూపర్ హీరోలు ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిని తన సినిమాలతో పరిచయం చేయబోతున్నాడు. ఈ యంగ్ డైరెక్టర్ తాజాగా ఆదిపురుష్ సినిమాపై కీలక వ్యాఖ్యాలు చేశాడు. ఆదిపురుష్ సినిమాలో కొన్ని సీన్స్ తనని బాధించాయి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రశాంత్ వర్మ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. కానీ, హనుమాన్ చిత్రంలో ఆ విషయం పాన్ ఇండియన్ ఆడియన్స్ కి బాగా తెలిసొచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి ఫ్యాన్స్ అయిపోయారు. హనుమాన్ సక్సెస్ సందర్భంగా తాజాగా ప్రశాంత్ వర్మ బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ఆదిపురుష్ సినిమాకి సంబంధించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. “ఆదిపురుష్ సినిమాలో కొన్ని సీన్స్ నాకు ఎంతగానో నచ్చాయి. వాటిని తెరకెక్కించిన తీరు నన్ను ఆశ్చర్య పరిచింది.

అయితే ఆదిపురుష్ చిత్రంలో కొన్ని సీన్స్ మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనైతే ఆ సీన్స్ ని ఇంకా బాగా తీయగలనేమో అనిపించింది. ఆ విషయం నాకు మాత్రమే కాదు.. ఏ సినిమా మేకర్ కి అయినా అలాగే అనిపిస్తుంది. ఆదిపురుష్ సినిమా రిజల్ట్ ప్రభావం నాపైన అస్సలు పడలేదు” అంటూ ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ సినిమాకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. నిజానికి హనుమాన్ టీజర్ రిలీజ్ చేసిన సమయంలో ఓంరౌత్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడం చూశాం. సినిమా తీయడం అంటే ఇదీ అంటూ ఓంరౌత్ ని ట్రోల్ చేశారు. ఇప్పుడు స్వయంగా ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ పై మాట్లాడటంతో ఆ కామెంట్స్ మరింత వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ సినిమా విషయానికి వస్తే.. థియేటర్లలో ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూనే ఉంది. చిత్రబృందం తాజాగా గ్రాటిట్యూడ్ మీట్ ని కూడా నిర్వహించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ క్రేజ్ ఇంకా తగ్గలేదు. కలెక్షన్స్ సునామి సృష్టించడం మాత్రమే కాకుండా.. తాజాగా రూ.250 కోట్ల క్లబ్ లో చేరి ఔరా అనిపించింది. చిన్న సినిమా అనే ట్యాగ్ తో వచ్చిన హనుమాన్ మూవీ అన్ని పెద్ద సినిమాల రికార్డులను బద్దలు కొట్టుకుంటూ పోతోంది. మరో నాలుగు రోజుల వరకు హనుమాన్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ తర్వాత కూడా ఇదే జోరు కొనసాగితే ఈ మూవీ రూ.300 కోట్ల క్లబ్ లో చేరినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి.. ఆదిపురుష్ మూవీపై ప్రశాంత్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş