iDreamPost
android-app
ios-app

హనుమాన్‌, గుంటూరు కారం 8వ రోజు కలెక్షన్‌!

Hanuman And Guntur Kaaram Collection: గుంటూరు కారం, హనుమాన్‌ సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరి 12వ తేదీన విడుదల అయ్యాయి.

Hanuman And Guntur Kaaram Collection: గుంటూరు కారం, హనుమాన్‌ సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. జనవరి 12వ తేదీన విడుదల అయ్యాయి.

హనుమాన్‌, గుంటూరు కారం 8వ రోజు కలెక్షన్‌!

తెలుగునాట సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి. 12వ తేదీ మహేష్‌ బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం విడుదల అయింది. అదే రోజు ప్యాన్‌ ఇండియా చిత్రం హనుమాన్‌ కూడా విడుదల అయింది. 13న వెంకటేష్‌ ‘సైంధవ్‌’.. 14వ తేదీన నాగార్జున ‘నా సామిరంగ’ కూడా విడుదల అయింది. అయితే, గుంటూరు కారం, హనుమాన్‌ సినిమాల మధ్యే పోటీ నడిచింది. ప్రీబుకింగ్స్‌ దగ్గరినుంచి కలెక్షన్ల వరకు రెండు సినిమాలు పోటీ పడ్డాయి.

ఈ పోటీ హనుమాన్‌ చిన్న సినిమా అయినా తన సత్తా చాటుతోంది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 25 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రెండు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ సాధించింది. వారం రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మూవీ విడుదల అయి వారం గడిచినా.. కలెక్షన్లు మాత్రం తగ్గటం లేదు. థియేటర్లలో 90 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. ఇక, 8వ రోజు ఏకంగా 9 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. అంతేకాదు..

ఇక, గుంటూరు కారం విషయానికి వస్తే.. ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 40 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటి వరకు 200 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది. థియేటర్లలో పర్లేదు అన్నట్లుగా బుకింగ్స్‌ అవుతున్నాయి. ఇక, 8వ రోజు సినిమా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. హనుమాన్‌ – గుంటూరు కారం సినిమాలకు మధ్య నడిచిన పోరులో హనుమాన్‌దే పై చెయ్యి అయింది. గుంటూరు కారంకు ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాంటి కలెక్షన్లు.. తెలంగాణలో ఒకలాంటి కలెక్షన్లు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మూవీ 90 శాతం బ్రేక్‌ ఈవెన్‌ను పూర్తి చేసింది. కానీ, తెలంగాణలో మాత్రం సినిమాకు నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ స్టార్‌ హీరో సినిమాకు ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ ఫలితాలు రావటం ఇదే మొదటి సారి. కాగా, గుంటూరు కారం సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించారు. హనుమాన్‌ సినిమా విషయానికి వస్తే.. తేజ సజ్జకు జంటగా.. అమృత అయ్యర్‌ నటించారు. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వినయ్‌ రాయ్‌, సముద్ర ఖని, వెన్నెల కిశోర్‌, గెటప్‌ శ్రీను నటించారు. మరి, రెండు సినిమాల 8వ రోజు కలెక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.