iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు హాట్‌ లుక్స్‌తో మత్తెక్కించింది.. ఇప్పుడేమో ఆశ్రమంలో గుర్తుపట్టలేని విధంగా!

  • Published Jun 27, 2023 | 4:13 PM Updated Updated Jun 27, 2023 | 4:13 PM
  • Published Jun 27, 2023 | 4:13 PMUpdated Jun 27, 2023 | 4:13 PM
ఒకప్పుడు హాట్‌ లుక్స్‌తో మత్తెక్కించింది.. ఇప్పుడేమో ఆశ్రమంలో గుర్తుపట్టలేని విధంగా!

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. ఇక్కడ సక్సెస్‌కు మాత్రమే గుర్తింపు ఉంటుంది. ఫెయిలైన వారికి ఇక్కడ చోటే ఉండదు. కానీ ఒక్కసారి ఆ రంగుల లోకానికి అలవాటుపడిన వారు.. సామాన్యుల మాదిరి జీవనం సాగించాలంటే.. చాలా కష్టం. అటు అవకాశాలు లేక.. ఇటు అందరిలా సాధారణ జీవితం గడపలేక.. చాలా మంది నరకం అనుభవిస్తారు. ఆ బాధలోనే డిప్రెషన్‌కు గురై.. జీవితాలను అంతం చేసుకుంటారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే.. జీవిత సత్యాన్ని గ్రహించి.. ముందుకు సాగుతారు. అలాంటి వారిలో కొందరు రంగుల లోకానికి పూర్తిగా గుడ్‌బై చెప్పి.. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తారు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఈ కోవకు చెందిన నటి గురించే. ఒకప్పుడు ఆమె తన హాట్‌ లుక్స్‌తో కుర్రకారును ముప్పతిప్పలు పెట్టింది. తన గ్లామర్‌తో హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. కట్‌ చేస్తే.. ఇప్పుడు కాషాయ వస్త్రాలు ధరించి.. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ.. ప్రశాంత జీవనం గడుపుతుంది. ప్రస్తుతం సదరు నటికి సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

హంస నందిని.. దాదాపు 20 ఏళ్ల క్రితమే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికి.. అనుకున్న మేర రాణించలేదు. అయితే ఐటమ్‌గర్ల్‌గా మాత్రం.. పిచ్చ క్రేజ్‌ సంపాదించుకుంది. అలా ఓ ఐదేళ్ల పాటు ఐటమ్‌గర్ల్‌గా వరస అవకాశాలు అందిపుచ్చుకుని.. ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. మధ్యలో క్యాన్సర్‌ బారిన పడినట్లు అభిమానులకు షాక్‌ ఇచ్చింది. ఇప్పుడేమో ఉన్నట్లుండి ఓ ఆశ్రమంలో కనిపించి అందరికీ షాకిచ్చింది. కాషాయ దుస్తుల్లో.. ప్రశాంతమైన ముఖంతో.. ఏదో తెలియని అందంతో మెరిసిపోతుంది హంస నందిని.

మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగిన హంస నందిని.. 2004లో ‘ఒక్కటవుదాం’ అనే తెలుగు సినిమాతో నటిగా మారింది. ఆ తర్వాత అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, ఈగ తదితర చిత్రాల్లో నటించింది. ఎప్పుడైతే ప్రభాస్ ‘మిర్చి’లో ఐటమ్ సాంగ్ చేసిందో.. అప్పటి నుంచి ఈమె దశ తిరిగింది. మిర్చి సినిమా తర్వాత ఆమెకు స్పెషల్ సాంగ్స్‌లో ఆఫర్స్‌ క్యూ కట్టాయి . అలా దాదాపు ఐదేళ్ల పాటు డ్యాన్సులతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది హంస నందిని. ‘మిర్చి’లో స్పెషల్ సాంగ్ చేసిన తర్వాత.. భాయ్, రామయ్య వస్తావయ్యా, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్ని నాయనా, శ్రీరస్తు శుభమస్తు, జై లవకుశ చిత్రాల్లోని స్పెషల్‌ సాంగ్స్‌లో మెరిసింది హంస నందిని. 2018లో చివరగా గోపీచంద్ ‘పంతం’లో కనిపించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది హంస నందిని.

క‍్యాన్సర్ తర్వాత మారిన ఆలోచనా విధానం..

అయితే హంస నందిని సినిమాల్లో కనిపించకపోవడంతో అందరూ ఆమె గురించి మర్చిపోయారు. ఇలా ఉండగా ఓ రోజు సడన్‌గా తనకు క్యాన్సర్‌ అని చెప్పి.. అభిమానులకు షాకిచ్చింది హంస నందిని. 2021 చివర్లో ఇన్ స్టాలో.. తాను క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని పోస్ట్‌ చేసింది. త్వరలో కోలుకుంటానని ధీమా వ్యక్తం చేసింది. చెప్పినట్లుగానే మెల్లమెల్లగా ఆ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడింది. ఈ క్రమంలోనే తాజాగా హంస నందిని కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో కనిపించింది. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈమెని నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేకపోయారు.. అంతలా మారిపోయింది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు.. ఇప్పుడే అందంగా ఉన్నావ్‌ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Hamsa Nandini (@ihamsanandini)