iDreamPost
android-app
ios-app

Guntur kaaram: నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం ఆల్ టైం రికార్డ్

  • Published Mar 07, 2024 | 1:27 PM Updated Updated Mar 07, 2024 | 1:27 PM

ఫిబ్రవరిలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో మహేష్ బాబు గుంటూరు కారం అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రికార్డుల వేట మొదలుపెట్టింది.

ఫిబ్రవరిలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో మహేష్ బాబు గుంటూరు కారం అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రికార్డుల వేట మొదలుపెట్టింది.

  • Published Mar 07, 2024 | 1:27 PMUpdated Mar 07, 2024 | 1:27 PM
Guntur kaaram: నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం ఆల్ టైం రికార్డ్

చూస్తుంటే ఓటీటీలో మహేష్ బాబు గుంటూరు కారం డామినేషన్ ఇప్పట్లో ఆగేలా లేదు. ఫిబ్రవరిలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో అడుగుపెట్టినప్పుటి నుంచీ ఈ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రికార్డుల వేట మొదలుపెట్టింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో 2024 సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా (Most viewed South Indian Film) రికార్డు సృష్టించింది. 4.9 మిలియన్ల వ్యూస్ తో గుంటూరు కారం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో నాని నటించిన హాయ్ నాన్న (4.2 మిలియన్ల వ్యూస్), ప్రభాస్ – ప్రశాంత్ నీల్ ల మాస్ యాక్షన్ డ్రామా సలార్ (3.5 మిలియన్ల వ్యూస్) సినిమాలు ఉన్నాయి.

ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే హిందీ వెర్షన్లో కూడా గుంటూరు కారం సినిమాకి మంచి స్పందన రావడమే. గత వారం నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన టాప్ 10 ఇండియా లిస్ట్ లో గుంటూరు కారం హిందీ వెర్షన్ కూడా ఉంది. షారుఖ్ ఖాన్ ‘డంకీ’ నెం.1 స్థానంలో ట్రెండ్ అవగా, ‘యానిమల్’ కూడా ఆ చార్ట్ లో వరుసగా ఆరో వారం నిలిచింది. ఫిబ్రవరి 26 – మార్చి 3, 2024 వరకూ నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 సినిమాల్లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే ‘గుంటూరు కారం’ హిందీ డబ్బింగ్ వెర్షన్ 6వ స్థానంలో ట్రెండింగ్లో ఉండడమే. కాగా గుంటూరు కారం అంతకు ముందు వారంలో 4వ స్థానంలో నిలిచింది. మొత్తంగా గుంటూరు కారం హిందీ డబ్బింగ్ వెర్షన్ నెట్ ఫ్లిక్స్ ఇండియా టాప్ 10లో వరుసగా నాలుగో వారం ట్రెండింగ్లో ఉంది.

మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో పని చేసేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మళ్ళీ తన అభిమానులను అలరించేలా పక్కా మాస్ సినిమా చేయడానికి సమయం పడుతుంది కాబట్టి అన్ని అంశాలూ గుంటురు కారంలో ఉండేలా జాగర్తలు తీసుకున్నానని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన అనుకున్నట్లే రమణ అనే మాస్ క్యారెక్టర్ లో తనదైన శైలికి ఎంటర్టైన్ చేసి గుంటూరు కారం సినిమాకి థియేటర్లలో తన స్టార్ ఇమేజ్ తో కలెక్షన్లు తెచ్చిపెట్టడమే కాక ఓటీటీలో కూడా రికార్డులు సృష్టించారు.