iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ బడ్జెట్‌, ప్రీ రిలీజ్ బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ లెక్కలు

సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన బడ్జెట్‌ మరియు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు సోషల్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి వాటికి తగ్గట్లుగా గుంటూరు కారం రాబట్టేనా అనేది ఇక్కడ చర్చిద్దాం.

సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన బడ్జెట్‌ మరియు ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు సోషల్‌ మీడియాలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి వాటికి తగ్గట్లుగా గుంటూరు కారం రాబట్టేనా అనేది ఇక్కడ చర్చిద్దాం.

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ బడ్జెట్‌, ప్రీ రిలీజ్ బిజినెస్‌, బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్ లెక్కలు

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం సినిమా గత ఏడాదిలోనే రావాల్సి ఉన్నా కూడా ఏవో కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మహేష్ బాబు వంటి స్టార్‌ హీరో సినిమా, అది కూడా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా సంక్రాంతికి విడుదల అవ్వడం కచ్చితంగా కలిసి వచ్చే విషయం. ఇతర సమయాల్లో కంటే సంక్రాంతికి థియేటర్లకి ప్రేక్షకుల ఫుట్‌ ఫాల్‌ ఎక్కువగా ఉంటుంది. అందుకే గుంటూరు కారం సినిమా సంక్రాంతికి అనగానే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యిందని, అలాగే భారీ ఎత్తున వసూళ్లు కూడా నమోదు చేయగలదు అనే ప్రచారం జోరుగా సాగుతోంది.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుంచి అందుతున్న ఆఫ్‌ ది రికార్డ్‌ సమాచారం ప్రకారం రూ.150 కోట్ల బడ్జెట్‌ తో అనుకున్న గుంటూరు కారం సినిమా షూటింగ్‌ ఆలస్యం అవ్వడంతో పాటు, మేకింగ్‌ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం, బెస్ట్‌ కోసం ఎక్కువ సన్నివేశాల చిత్రీకరణ వంటి కారణాల వల్ల దాదాపుగా బడ్జెట్‌ రూ.200 కోట్లకు వెళ్లిందట. మహేష్ బాబు సినిమాకు రూ.200 కోట్ల బడ్జెట్‌ పెద్ద విషయం ఏమీ కాదు. థియేట్రికల్‌ మరియు నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ ద్వారా ఈజీగా నిర్మాత బ్రేక్‌ ఈవెన్‌ ను సాధించగలడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్నట్లుగానే ఈ సినిమా థియేట్రికల్‌ రైట్స్ ద్వారా నిర్మాతకు దాదాపుగా రూ.150 కోట్ల రూపాయలను తెచ్చి పెట్టింది. ఇక శాటిలైట్‌ మరియు ఓటీటీ రైట్స్ ద్వారా అటు ఇటుగా వంద కోట్ల వరకు వచ్చి ఉంటుందని అంచనా.

ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా ఏకంగా రూ.250 కోట్ల వరకు నిర్మాతకు దక్కింది. ఇక సినిమా థియేట్రికల్‌ రైట్స్ ద్వారా 150 కోట్ల రూపాయలను దక్కించుకున్న నేపథ్యంలో బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ భారీగా ఉంది. 160 కోట్ల వరకు గుంటూరు కారం సినిమా వసూళ్లు చేయాల్సి ఉందని తెలుస్తోంది. కేవలం ఓవర్సీస్‌ లో ఏకంగా మూడున్నర నుంచి నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా మల్టీ ప్లెక్స్ స్క్రీనింగ్‌ ఉంటుంది. కనుక అన్ని చోట్ల కలిపి 160 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడం ద్వారా బ్రేక్‌ ఈవెన్‌ అవుతుందని అంచనా. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న ఈ లెక్కలను గుంటూరు కారం ఎంత వరకు రీచ్‌ అవుతుంది అనేది చూడాలి. ఈ సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న గుంటూరు కారం లాంగ్ రన్‌ లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వసూళ్లు చేస్తుందని భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.