Venkateswarlu
గుంటూరుకారం విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. 12వ తేదీ 1 గంటనుంచే షోలు మొదలవ్వనున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్పెషల్ షోలకోసం ప్రభుత్వం పర్మీషన్ కూడా ఇచ్చింది.
గుంటూరుకారం విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది. 12వ తేదీ 1 గంటనుంచే షోలు మొదలవ్వనున్నాయి. ఈ మేరకు తెలంగాణ స్పెషల్ షోలకోసం ప్రభుత్వం పర్మీషన్ కూడా ఇచ్చింది.
Venkateswarlu
మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇక, గుంటూరు కారం నైజాం హక్కుల్ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను పెద్ద ఎత్తును రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే స్పెషల్ షోలకోసం పర్మీషన్ సైతం తీసుకున్నారు. ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో స్పెషల్ షోలకు పర్మీషన్ ఇచ్చింది. ఈ కింది థియేటర్లలో 12వ తేదీ అర్థరాత్రి 1 గంటకు స్పెషల్ షోలు పడనున్నాయి.
కాగా, గుంటూరు కారంలో మహేష్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించారు. తాజాగా, విడుదల అయిన గుంటూరు కారం మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో ట్రైలర్ రికార్డులు సైతం క్రియేట్ చేసింది. 18 గంటల్లోనే 30 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. పాత రికార్డులను తుడిచి పెట్టేసింది.
నిన్న గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌లో మహేష్ బాబు మాట్లాడుతూ.. తన సినిమాలు, రికార్డుల గురించి, కలెక్షన్ల గురించి తండ్రి క్రిష్ణ తనతో మాట్లాడుతుంటే ఎంతో సంతోషంగా అనిపించేదని అన్నారు. మూవీ రిలీజ్ అవ్వగానే చూసి, తనకు ఫోన్ చేసి ఎలా ఉందో చెప్పేవారని అన్నారు. ఆ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడినని, కానీ ఇప్పుడు ఆయన లేరు కాబట్టి.. ఆ బాధ్యత అభిమానులు తీసుకోవాలని కోరారు. అభిమానులకు చేతులెత్తి దండం పెట్టారు. మరి, గుంటూరు కారం సినిమా థియేటర్ల లిస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#GunturKaaram spl.shows 1 am pic.twitter.com/8blljzc49Q
— devipriya (@sairaaj44) January 9, 2024