iDreamPost
android-app
ios-app

ఘాటెక్కుతున్న గుంటూరు కారం వివాదం.. ఫ్యాన్స్‌తో గొడవేంటి?

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ ప్రారంభించినప్పటి నుంచే సినిమా పై అంచనాలు పెంచే విధంగా నిర్మాత నాగ వంశీ ట్వీట్స్ చేస్తూ వచ్చాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది.

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ ప్రారంభించినప్పటి నుంచే సినిమా పై అంచనాలు పెంచే విధంగా నిర్మాత నాగ వంశీ ట్వీట్స్ చేస్తూ వచ్చాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్‌ అవుతోంది.

ఘాటెక్కుతున్న గుంటూరు కారం వివాదం.. ఫ్యాన్స్‌తో గొడవేంటి?

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సంక్రాంతికి కేవలం గుంటూరు కారం సినిమా మాత్రమే కాకుండా నాగార్జున నటిస్తున్న నా సామి రంగ, రవితేజ నటిస్తున్న ఈగల్‌, తేజ సజ్జా హనుమాన్ సినిమా మరియు వెంకటేష్ నటిస్తున్న సైంధవ్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. సంక్రాంతికి సాధారణంగానే పోటీ ఎక్కువ ఉంటుంది. అయితే ఈసారి మరీ ఎక్కువ పోటీ ఉండటంతో ఎవరైనా కాస్త తగ్గితే బాగుంటుంది, లేదా రెండు మూడు రోజుల గ్యాప్‌ తో అయినా విడుదల చేసుకుంటే బెటర్ అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ గుంటూరు కారం చిత్ర నిర్మాత అయిన నాగ వంశీ మాత్రం ఏ విషయంలో తగ్గేది లేదు. ఎవరితో ఫైట్‌ లేదు, ఎవరితోనూ వాదనలు లేవు అంటూ చేసిన ట్వీట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఎవరితోనూ ఫైట్‌ చేయవద్దు, లేదంటే వాదించవద్దు.. కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లు అంటూ డాగ్ స్టోరీ మోరల్‌ ను ట్వీట్‌ చేయడం ద్వారా నాగ వంశీ తమ గుంటూరు కారం విషయంలో ఎవరితోనూ చర్చలు జరిపేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. మేము ఏం చేస్తున్నాం అనేది మాకు బాగా తెలుసు. కనుక మనం అందరం కూడా జనవరి 12న థియేటర్లలో కలుద్దాం అన్నట్లుగా నాగ వంశీ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ తో సంక్రాంతి సందడి ఓ రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం పై ఉన్న నమ్మకంతోనే నాగ వంశీ అలాంటి ట్వీట్‌ చేశాడు అని.. కచ్చితంగా ఆ నమ్మకం నిలిపే విధంగా త్రివిక్రమ్‌ సినిమాను రూపొందించి ఉంటాడు అంటున్నారు.

సినిమాలు సంక్రాంతికి విడుదల అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. కనుక నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుని పోటీ లేకుండా అందరికి సమ న్యాయం జరిగే విధంగా ఒక నిర్ణయానికి రావాలని అనుకున్నా కూడా గుంటూరు కారం సినిమా మేకర్స్ ముఖ్యంగా ఒక నిర్మాత అయిన నాగ వంశీ మాత్రం అస్సలు తగ్గేది లేదు. మాట్లాడేది లేదు అన్నట్లుగా ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీకి సిద్దం అవుతున్నాడు. ఈ పోటీ వల్ల మహేష్ బాబుకి పెద్దగా నష్టం ఉండక పోవచ్చు. కానీ ఇతర సినిమాల మేకర్స్‌ మాత్రం కచ్చితంగా నష్టపోవాల్సి ఉంటుందని మహేష్ బాబు అభిమానులు కొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి మహేష్ బాబు సంక్రాంతి సినిమా వల్ల ఇతర సినిమాల పరిస్థితి కాస్త గందరగోళం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. విడుదల విషయంలో పంతం వీడని గుంటూరు కారం మేకర్స్‌ తీరుపై మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి.