iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం.. టాలీవుడ్‌ చరిత్రలో మొట్టమొదటి సారి..!

Guntur Kaaram Pre Release: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కిన మాస్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.

Guntur Kaaram Pre Release: సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ తెరకెక్కిన మాస్ మూవీ గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది.

గుంటూరు కారం.. టాలీవుడ్‌ చరిత్రలో మొట్టమొదటి సారి..!

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ గురించి ప్రస్తుం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకను యూఎస్ లో ఫ్యాన్స్ చూసేందుకు ఏర్పాట్లు జరిగాయి. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమా గుంటూరు కారం విడుదలకు ముందే అనేక రికార్డులను నమోదు చేస్తోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచి కూడా సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ వస్తున్న గుంటూరు కారం సినిమా ఇప్పుడు మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌ ఈ అరుదైన రికార్డ్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అతి త్వరలో అంగరంగ వైభవంగా సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ప్రీ రిలీజ్ వేడుకను యూఎస్ఏ లో ఫ్యాన్స్ లైవ్ స్ట్రీమింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్ట్రీమింగ్‌ హంగామా ఉంటుందని అక్కడి ఫ్యాన్స్ చెబుతున్నారు. గుంటూరు కారం సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను కాలిఫోర్నియాలోని ‘సినీ లాంజ్ ఫ్రీమాంట్ 7 సినిమాస్‌’లో లైవ్ స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. అతి త్వరలోనే పాస్ లను జారీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Guntur kaaram

యూఎస్ లో ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను ఒక వేడుక మాదిరిగా చేసుకోవడం ఇదే ప్రథమం. టాలీవుడ్‌ సినీ చరిత్రలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న హీరోగా మహేష్ బాబు నిలువబోతున్నాడు అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ప్రీ రిలీజ్ వేడుక కి సంబంధించిన అధికారిక డేట్‌ ను ప్రకటించలేదు. అలాగే సినిమా యొక్క వేడుక వేదికను కూడా ప్రకటించలేదు. అయినా కూడా యూఎస్‌ఏ లో మాత్రం హడావుడి నెలకొంది. సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటం జరుగుతుంది. అందుకే ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లు నమోదు అవుతూ ఉంటాయి.

ఇప్పుడు అదే తరహా లో గుంటూరు కారం కి కూడా యూఎస్ తో పాటు ఇతర దేశాల్లో భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రైలర్‌ విడుదల తర్వాత కచ్చితంగా సినిమా స్థాయి డబుల్‌ అవ్వడం ఖాయం అంటున్నారు. ఇటీవల విడుదల అయిన ‘కుర్చీ మడత పెట్టి’ మాస్ సాంగ్‌ యూత్‌ ఆడియన్స్‌ లోకి బాగా వెళ్తోంది. ఇక సినిమా తప్పకుండా అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఉండి, మరో ఇండస్ట్రీ హిట్‌ ను మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ సినిమా ఆ స్థాయి విజయాన్ని సాధిస్తుందని మీరు భావిస్తున్నారా?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomCasibomcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş