iDreamPost
android-app
ios-app

టాక్ తో సంబంధం లేకుండా.. గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డు! ఇదీ మహేశ్ రేంజ్!

  • Published Jan 13, 2024 | 3:39 PM Updated Updated Jan 13, 2024 | 3:39 PM

Guntur Kaaram All Time Record: గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది.

Guntur Kaaram All Time Record: గుంటూరు కారం సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ, ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టింది.

  • Published Jan 13, 2024 | 3:39 PMUpdated Jan 13, 2024 | 3:39 PM
టాక్ తో సంబంధం లేకుండా.. గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డు! ఇదీ మహేశ్ రేంజ్!

సూపర్ స్టార్ మహేశ్ బాబు– మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ ఈ మూవీ వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో చాలా గ్యాప్ తర్వాత మహేశ్ బాబు మంచి మాస్ లుక్స్, మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపించాడు. మహేశ్- వెన్నల కిషోర్ మధ్య మరోసారి మంచి ర్యాప వర్కౌట్ అయ్యింది. అయితే ఈ మూవీకి మాత్రం తొలిరోజు మిక్స్డ్ టాక్ సొంతమైంది. ఈ వార్తలు విన్న తర్వాత ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు. కానీ, ఈ వార్త విన్న తర్వాత వాళ్లు కాలర్ ఎగరేస్తారు. ఎందుకంటే గుంటూరు కారం తొలిరోజు కలెక్షన్స్ తో ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసుకుంది.

మిక్స్డ్ టాక్, నెగిటివ్ రివ్యూస్, మౌత్ పబ్లిసిటీ ఇవన్నీ కూడా గుంటూరు కారం సినిమా కలెక్షన్స్ ని, రికార్డులను అడ్డుకోలేకపోయింది. ఇది రమణగాడి పక్కా బ్లాక్ బస్టర్ అంటూ సినిమా టీమ్ ప్రకటించింది. నిజానికి ఈ క్రెడిట్ మొత్తం మహేశ్ కే దక్కాలి. ఎందుకంటే మూవీ మొత్తాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. ఇప్పుడు ఇలాంటి టాక్, రివ్యూల మధ్య కూడా గుంటూరు కారం ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసిందంటే అందుకు ప్రధాన కారణం మహేశ్ బాబు బాక్సాఫీస్ స్టామినానే కారణం అని చెప్పాలి. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన తొలిరోజు కలెక్షన్స్ గురించి ఫ్యాన్స్, ట్రేడ్ నిపుణులు కొన్ని నంబర్స్ ని అంచనా వేస్తూ చెప్పుకొచ్చారు.

ట్రేడ్ వర్గాల వారి ఊహాగానాలను తలకిందులు చేస్తూ.. గుంటూరు కారం సినిమా తొలిరోజు రూ.94 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. ఒక రీజనల్ సినిమా వరల్డ్ వైడ్ గా తొలిరోజు ఈ స్థాయి కలెక్షన్స్ తీసుకురావడం ఇదే ప్రథమం అంటూ చిత్ర బృందం ప్రకటించింది. తొలిరోజు వచ్చిన మిక్స్డ్ టాక్, రివ్యూలతో డీలా పడిన మహేశ్ ఫ్యాన్స్ కు ఇది మంచి బూస్ట్ ఇచ్చిన విషయం అనే చెప్పాలి. ఈ రికార్డులు చూసిన తర్వాత సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేస్తున్నారు. ఇది సార్ మా మహేశ్ రేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా గుంటూరు కారం టాక్ మారుతోంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు తొలిరోజుల్లో నెగిటివ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయంటూ కామెంట్ చేస్తున్నారు.

మరోవైపు గుంటూరు కారం టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. ఈ మూవీ టాక్ కచ్చితంగా మారుతుందని.. బ్లాక్ బస్టర్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాను టాక్ తెలుసుకోవడమే కాకుండా.. సుదర్శన్ థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చుని వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో స్వయంగా చూశానని చెప్పారు. ఆడియన్స్ ని స్వయంగా చూసిన తర్వాత తన నమ్మకం మరింత పెరిగిందంటూ కామెంట్స్ చేశారు. మరి.. గుంటూరు కారం తొలిరోజు కలెక్షన్స్ తో ఆల్ టైమ్ రికార్డులు బద్దలు కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss