iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం ‘కుర్చీ మడతపెట్టి..’’ పాట లిరిక్స్‌!

Guntur Kaaram Kurchi Madatha Petti Song Lyrics:సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమానుంచి తాజాగా ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Guntur Kaaram Kurchi Madatha Petti Song Lyrics:సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమానుంచి తాజాగా ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గుంటూరు కారం ‘కుర్చీ మడతపెట్టి..’’ పాట లిరిక్స్‌!

కుర్చీ తాత గురించి.. కుర్చీ మడత పెట్టి.. డైలాగ్‌ గురించి తెలుగు వారికి తెలియకుండా ఉండదు. కుర్చీ తాత, ఆయన చెప్పిన డైలాగు సోషల్‌ మీడియాలో చాలా వైరల్‌గా మారాయి. మీమర్స్‌ అయితే, ఈ డైలాగును తెగ వాడుసుకున్నారు. స్పూఫులు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా సినిమాలోనే ‘ కుర్చీ తాత’ డైలాగుపై పాట వచ్చింది. సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు- త్రివిక్రమల్‌ల సినిమా గుంటూరు కారంలో ఆ డైలాగ్‌తో ఓ పాటను క్రియేట్‌ చేశారు.

తాజాగా, ఈ  కుర్చీ మడతపెట్టి.. పాట సోషల్‌ మీడియాలో విడుదల అయింది. శనివారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌లో విడుదల అయిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వెళ్లింది. యూట్యూబ్‌లోకి వచ్చిన గంటలోనే లక్ష వ్యూస్‌ తెచ్చుకుంది. పాటకు మంచి స్పందన వస్తోంది. థమన్‌ కొట్టిన బీట్స్‌కు, ఆ పాట లిరిక్స్‌ అద్భుతంగా సెట్‌ అయ్యాయి. ఈ మాస్‌ సాంగ్‌ రానున్న రోజుల్లో జనాల్ని ఉర్రూతలూగించటం ఖాయం అనిపిస్తోంది.

‘కుర్చీ మడతపెట్టి..’’ పాట లిరిక్స్‌!

రాజమండ్రి రాగ మంజరి..
మా అమ్మ పేరు తలవనోళ్లు లేరు మేస్త్రిరి..
కళాకారుల ఫ్యామిలీ మరి..
మేము గజ్జ గడితే నిదురు పోదు నిండు రాతిరి..

సోకులాడి స్వప్న సుందరి..
నీ మడత చూపు మాపటేల మల్లె పందిరి..
రచ్చరాజుకుందె ఊపిరి..
నీ వంకచూస్తే.. గుండెలోన డీరి డిరి,డిరి..
తూనీగ నడుములోన తూటాలెట్టీ..
తుపాకీ పేల్చినావే తింగరి చిట్టీ..
మగజాతి నట్ట మడతపెట్టి..

ఆ కుర్చీని మడత పెట్టి…

దాని కేమో.. మరి దానికేమో.. దానికేమో మేకలిస్తివి..
మరి, నాకేమో సన్న బియ్యం నూకలిస్తివి..
మేకలేమో..వందలు పెరిగిపోయే..
నాకిచ్చిన నూకలేమో ఒక్క పూటకు కరిగిపాయే..
ఆడపచ్చరాళ్ల జుకాలిస్తివి.. మరి, నాకేమో చుక్క కళ్ల కోకలిస్తివి..
దాని చెవిలో జుకాలేవే దగా, దగా మెరిసిపాయే..
నాకు పెట్టిన కోక లేమో పీలికలై చిరిగిపోయే..

ఏం రసిక రాజువో మరి, నా దాసు బావ నీ ఇప్పుడింతే కిరికిరి..
ఏం రసిక రాజువో మరి, నా దాసు బావ నీ ఇప్పుడింతే కిరికిరి..

ఆ కుర్చీని మడత పెట్టి…

సో..సో సోకు లాడి స్వప్న సుందరి
మాపటేల మల్లె పందిరి..
రచ్చరాజుకుందె ఊపిరి..
గుండెలోన డీరి డిరి,డిరి..

ఏందట్టా చూస్తన్నా.. ఇక్కడ ఎవడి బాధలకు వాడే లిరిక్‌ రైటర్‌.. రాసుకోండి.. మడతెట్టి పడేయండి.

మడత పెట్టి… మ..మమ.. మడత పెట్టి… మ..మమ..
మడత పెట్టి… మ..మమ.. మడత పెట్టి… మ..మమ..
ఆ కుర్చీని మడత పెట్టి…

మరి, మడత కుర్చీ పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.