iDreamPost
android-app
ios-app

సీరియల్స్ లో పద్ధతిగా కనిపించే ఈ నటి.. బయట మాత్రం చాలా బో*ల్డ్.. ఎవరంటే?

  • Published May 15, 2024 | 5:53 PM Updated Updated May 15, 2024 | 5:53 PM

Guess This Serial Artist: బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ అంటే ఒక ఎమోషన్. ఆ సీరియల్స్ లో చేసే హీరో, హీరోయిన్స్ అంటే కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఈ అమ్మడుని గుర్తు పట్టారా? ఈమెకు తెలుగులోనే కాదు.. కన్నడలో కూడా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

Guess This Serial Artist: బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్స్ అంటే ఒక ఎమోషన్. ఆ సీరియల్స్ లో చేసే హీరో, హీరోయిన్స్ అంటే కూడా పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఈ అమ్మడుని గుర్తు పట్టారా? ఈమెకు తెలుగులోనే కాదు.. కన్నడలో కూడా బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది.

  • Published May 15, 2024 | 5:53 PMUpdated May 15, 2024 | 5:53 PM
సీరియల్స్ లో పద్ధతిగా కనిపించే ఈ నటి.. బయట మాత్రం చాలా బో*ల్డ్.. ఎవరంటే?

తెలుగు ప్రేక్షకులకు సినిమాలు అంటే ఎంత ఇంట్రెస్టో.. సీరియల్స్ అంటే కూడా అంతే ఇంట్రస్ట్. సాయంత్రం అయ్యిందంటే కచ్చితంగా టీవీ ముందు కూర్చోవాల్సిందే. నచ్చిన సీరియల్స్ ని వరుస పెట్టి చూడాల్సిందే. ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత సీరియల్స్ లవర్స్ పని ఇంకా సులభం అయిపోయింది. టీవీలో మాదిరి యాడ్స్ లేకుండా సీరియల్స్ చూసేస్తున్నారు. అంతేకాకుండా.. సాయంత్రం రావాల్సిన సీరియల్ ఉదయమే స్ట్రీమింగ్ అవుతుంది. ఆ సీరియల్స్ లో చేసే ఆర్టిస్టులకు కూడా చాలా మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ అమ్మడు కూడా అలాంటి కోవకు చెందిందే.

ఒక సీరియల్ హిట్టు కొట్టిందంటే అందులో చేసే హీరో, హీరోయిన్ కు విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంది. వారికి సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ వస్తుంది. అలా తెలుగులో చాలానే హిట్టు సీరియల్స్ ఉన్నాయి. అలాంటి ఒక హిట్టు సీరియల్ లో ఈ అమ్మడు హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఆ సీరియల్ కు ఎంతో క్రేజ్ ఉంది. ఈ హీరోయిన్ కి కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులో చాలా తక్కువ సమయంలోనే మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బిగ్ బాస్ లో కూడా ఒక ఊపు ఊపేసి వచ్చింది. ఇంక ఈమె సోషల్ మీడియా ఫాలోయింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు.

ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా? ఆ అమ్మడు మరెవరో కాదు.. గుండెనిండా గుడి గంటలు సీరియల్ హీరోయిన్ మీనా పాత్ర పోషించే అమూల్య గౌడ. ఈ అమ్మడుకి అటు కన్నడలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడలో గౌరి అనే సీరియల్, తెలుగులో గుండెనిండా గుడి గంటలు అనే సీరియల్ చేస్తోంది. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అంతా మీనా- బాలు పాత్రలకు బాగా కనెక్ట్ అయిపోయారు. అలాగే అమూల్య గౌడ కన్నడ బిగ్ బాస్ లో పాల్గొన తన సత్తా చాటింది. తాను ఏ విషయంలో కూడా తీసిపోను అని ప్రూవ్ చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో కన్నడ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్ టైన్ చేసింది. ఇంక సోషల్ మీడియా అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

అమూల్య గౌడకు ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 5.44 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. డాన్స్, రీల్స్, మేకోవర్ అంటూ చాలానే వీడియోస్ చేసి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది. ఈ అమ్మడు అటు కన్నడలో ఇటు తెలుగులో ఆర్టిస్టులకు గట్టిగానే పోటీ ఇస్తోంది. అయితే సీరియల్ లో అమూల్యను చూసి.. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో చూసినప్పుడు మాత్రం అరే అక్కడ భలే పద్ధతిగా చీర కట్టులో ఉంది.. ఇక్కడ మాత్రం భలే మోడ్రన్ గా ఉందే అంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఆమె అటు ట్రెడిషన్, ఇటు ఫ్యాషన్ రెండింటిన పుల్ ఓవర్ చేయగలను అని నిరూపించుకుంది. మరి.. అమూల్య గౌడ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet